జగన్ ను పట్టించుకోవద్దని చంద్రబాబు సూచించారా.. ఆ విధంగా టార్గెట్ చేస్తున్నారా?

Reddy P Rajasekhar
రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీ ఎవరిపైనైనా విమర్శలు ప్రత్యర్థి ఎంతో బలమైన వాడేమో అనే చర్చ జరిగే అవకాశం ఉంటుంది. జగన్ పై టీడీపీ నేతలు విమర్శలు చేయడం కొత్త కాదు. అయితే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో జగన్ ను పట్టించుకోవద్దని చంద్రబాబు సూచించారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తానని చెప్పిన నేపథ్యంలో టీడీపీ నేతలు సైతం పెద్దగా రియాక్ట్ కాలేదు.
 
చంద్రబాబు ఎంపీలకు పార్లమెంట్ లో వ్యవహరించాల్సిన తీరు, రాష్ట్రం కొరకు నిధులను ఏ విధంగా రాబట్టాలి? అనే విషయాలను మాత్రమే వెల్లడించారని భోగట్టా. రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేయాలని చంద్రబాబు ఎంపీలకు సూచించినట్టు తెలుస్తోంది. జగన్ ను పట్టించుకోవడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని చంద్రబాబు ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది.
 
జగన్ ను పట్టించుకొని ఆయనను హీరో చేస్తే పార్టీకే తీవ్రస్థాయిలో నష్టమని చంద్రబాబు భావిస్తున్నారు. వైసీపీ అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఆ పార్టీ పుంజుకోవాలంటే చాలా సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే టీడీపీ వైపు నుంచి విమర్శలు రాకపోతే తమకే మంచిదని వైసీపీ భావిస్తోంది. టీడీపీ, వైసీపీ వ్యూహాలలో ఎవరి వ్యూహాలు బెస్ట్ అవుతాయో చూడాల్సి ఉంది.
 
వైసీపీ కార్యకర్తలపై దాడులు జరగడం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయని గతంలో వాళ్లు దాడి చేసిన నేపథ్యంలో ప్రస్తుతం వీళ్లు దాడులు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఈ కామెంట్లపై వైసీపీ నేతల ప్రణాళికలు ఎలా ఉంటాయో చూడాలి. ఐదేళ్లలో వైసీపీ ఏకంగా 140 సీట్లను కోల్పోవడం అంటే సాధారణ విషయం అయితే కాదని చెప్పవచ్చు. వైసీపీ నేతలు తెలివిగా ముందడుగులు వేయాల్సి ఉంది. కూటమి ఐదేళ్లలో ఎంత అద్భుతంగా పాలించినా ఆ పార్టీపై కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత అయితే వచ్చే ఛాన్స్ మాత్రం కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: