జగన్ ఇక డిప్రెషన్లోనుండి బయటపడ్డట్టేనా

Suma Kallamadi
ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ భారీ ఓటమి చవిచూసిన సంగతి తెలిసినదే. మాకిక ఎదురులేదు... 175 సీట్లు కూడా మావే అని ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించిన జగన్ కి ఆంధ్రా ప్రజలు ఝలక్కిచ్చారు. ఈ క్రమంలో జగన్ అండ్ కో చాలా షాక్ కి గురవ్వడం అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో 50 శాతం ఓటు షేర్ తో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న జగన్ అయిదేళ్ళు తిరిగేసరికి కేవలం 39 శాతం ఓటు షేర్ తో 11 సీట్లకు పరిమితం అయ్యారు. దాంతో వైస్సార్సీపీ వర్గం డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఆ తరువాత కాలంలో జగన్ తో సహా ఎవరూ తెర ముందుకి రాలేదు. జగన్ కేవలం బెంగుళూరికి పరిమితం అయ్యాడు.
అయితే, జగన్ పరిపాలనా కాలంలో మంత్రులు తమ నోటికి ఎంత మాట వస్తే అంత అంటూ ప్రతిపక్షంలోని వారిని పూర్తిగా అవమానించిన సంగతి ప్రజలు బాగా గమనించారు. అంతేకాకుండా జనసేనాని పవన్ కళ్యాణ్ ని అయితే వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేయడం అందరికీ తెలిసినదే. ఇక పగా ప్రతీకార దాడులు అనేవి షరా సర్వ సాధారణం అయిపోయింది. దాంతో ప్రజలలో ఒకవిధమైనటువంటి నెగిటివ్ టాక్ మొదలయ్యింది. కట్ చేస్తే ఓట్లు మొత్తం కూటమికే ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఇక చంద్రబాబుని జైలులో పెట్టిన తరువాత అప్పటిదాకా యాక్టివ్ గా లేని క్యాడర్ మొత్తం రీచార్జితో రెడీ అయిపోయింది. అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంది వచ్చి కూటమికి అనుకూలంగా పనిచేశారు.
ఇక ఘోర ఓటమి తరువాత జగన్ నిన్న మొన్నటి వరకు బెంగుళూరు యెహలంక పేలస్ కే పరిమితం అయ్యాడు. ఈ క్రమంలో కార్యకర్తనుండి, నాయకుల వరకు ఎవ్వరినీ జగన్ కలవడానికి సముఖత చూపించలేదు. అయితే తాజాగా పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన మర్డర్ అనంతరం జగన్ యాక్టివ్ అయ్యి మరలా ఏపీకి వచ్చి సదరు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఆదుకుంటానని చెప్పిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ క్రమంలో జగన్ టీడీపీ కూటమి ప్రభుత్వం పైన నిప్పులు చెరిగిన విషయం విదితమే. ఈ ఘటన తరువాత జగన్ వైఫల్యాన్ని వీడి ప్రజలలోకి వచ్చాడంటూ వైసీపీ వర్గం పండగ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే జగన్ డిప్రెషన్లోనుండి పూర్తిగా బయట పడ్డాడు అనే విషయాన్ని విశ్లేషకులు బయటకి చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: