రేవంత్ సర్కార్ తొలి ప్రాధాన్యత అదేనా...?

FARMANULLA SHAIK
రేవంత్‌ రెడ్డి మాస్ ఫాలోయింగ్ ఉన్న పొలిటికల్ లీడర్. తన పదునైన మాటలతో ప్రత్యర్థులను ఏకిపడేస్తారు. ఆయన ఏం చేసినా ఓ సంచలనమే.. విమర్శలు.. నిరసనలు ఇలా రేవంత్‌రెడ్డి చేసే ప్రతి పని ప్రత్యర్థి పార్టీలకు చెమటలు పట్టిస్తుంటాయి. ఆయన పొలిటికల్ కెరీర్ 20 ఏళ్లు కూడా లేకపోయినా.. 130 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు కావటమే కాదు పార్టీని అధికారంలోకి కూడా తీసుకొచ్చారు.ఈ నేపథ్యంలోఈ నెల 23 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్‌ క్యాలెండర్‌ను ప్రవేశపెడుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇక నుంచి ప్రతిఏటా మార్చిలోగా అన్ని శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు తెప్పించుకుంటామని తెలిపారు. జూన్‌ 2వ తేదీలోగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసి, డిసెంబర్‌ 9వ తేదీలోగా నియామకాల ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో శనివారం సింగరేణి సంస్థ సామాజిక బాధ్యత (సీఎస్సార్‌)లో భాగంగా సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష పాసైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థుల్లో అర్హులకు లక్ష చొప్పున ఆర్థికసహాయం అందించే ‘రాజీవ్‌గాంధీ సివిల్స్‌ అభయహస్తం పథకం’ ప్రారంభోత్సవంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఉద్యోగాల కోసమే తెలంగాణ పోరాటం జరిగిందని, నిరుద్యోగుల సమస్యలు పరిషరించడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆయన చెప్పారు.

నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత. అందుకే అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామన్నారు. గత పదేళ్లలో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగిందని, అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే టీజీపీఎస్సీని రద్దు చేసి కొత్త బోర్డును యూపీఎస్సీ తరహాలో ఏర్పాటు చేశామన్నారు. గ్రూప్ –1 ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తి చేశామని, డీఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయని తెలిపారు. డీఎస్సీ పరీక్షలు వెంటనే గ్రూప్ –2 పరీక్షలు ఉండటంతో ప్రిపేర్ కావడానికి ఇబ్బందులు ఎదురవుతాయన్న నిరుద్యోగుల ఇబ్బందులను గుర్తించి గ్రూప్–2 పరీక్షలు వాయిదా వేశామన్నారు. తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే.. అందుకే పకడ్బందీ ప్రణాళికతో పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించాలని నిర్ణయించామన్నారు. కార్యక్రమంలో డెప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించిన విద్యార్థులను సత్కరించి వారికి రూ.లక్ష చొప్పున చెక్కులు అందజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: