మినిస్టర్ కీలక నిర్ణయం.. ఉపేక్షిస్తే తగ్గేదే లేదు..!

Divya
ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీసీ సంక్షేమ హాస్టల్ లో ఉంటున్న విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలిగినా బాధ్యులైన అధికారులను ఉపేక్షించబోను అని బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత హెచ్చరించారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని ,తక్షణమే హాస్టల్లో మెరుగైన సదుపాయాలు కల్పించాలని ఆమె అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భోజనం, త్రాగునీరు, వసతుల విషయంలో రాజీ పడకుండా చూసుకోవాలని, మన ఇంట్లో పిల్లల్ని మనం ఏ విధంగా అయితే చూసుకుంటామో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో హాస్టల్లో ఉండే పిల్లల విషయంలో కూడా అలాంటి శ్రద్ధ చూపించాలని ఆమె తెలిపారు.
ముఖ్యంగా పలు హాస్టల్స్ ను పరిశీలించిన మంత్రి సవిత చాలాచోట్ల వసతులు సరిగ్గా లేవని,  ఇబ్బంది పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని , ముఖ్యంగా డెంగ్యూ ,డయేరియా లాంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె తెలిపారు. వసతుల విషయంలో రాజీ పడే అధికారులను ఉపేక్షించ బోనని అన్ని హాస్టల్లో కూడా విధిగా నిర్వహణ చర్యలు తీసుకోవాలని,  పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యంగా సరైన ఆహారం, మంచినీరు , వసతులు అన్నీ కూడా సక్రమంగా ఉంటేనే పిల్లల చదువుకు ఎటువంటి ఆటంకాలు ఉండవని, లేకపోతే పిల్లలకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని.. అందుకే పిల్లల విషయంలో ఎవరైనా ఉపేక్షిస్తే ఊరుకునేది లేదు అంటూ హెచ్చరించారు మంత్రి సవిత.ఇక ఈ విషయంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. పిల్లలు హాస్టల్లో ఉంటే ప్రస్తుత వర్షాకాలంలో పిల్లలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో అని తల్లిదండ్రులు సతమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మినిస్టర్ సవిత తీసుకున్న నిర్ణయం పై హర్షం వ్యక్తం చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి మంత్రి ఆదేశాల మేరకు అధికారులు ఏ విధంగా పనిచేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: