ఏపీ: టిడిపి నేతల మధ్య అంతర్యుద్ధం..అక్కడ ఏం జరుగుతోంది..?

Divya
టిడిపికి గట్టిపట్టు ఉన్నటువంటి ప్రాంతాలలో శ్రీకాకుళం కూడా ఒకటి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పదికి పది స్థానాలతో టీడీపీ పార్టీ ఘన విజయాన్ని అందుకుంది.. అలాగే పార్లమెంటు స్థానంలో కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వరసగా మూడవసారి సిక్కోలు ప్రజలు గెలిపించారు.. గత ఐదేళ్ల నుంచి వైసీపీ టిడిపి కార్యకర్తలను వేధిస్తున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రజలు వైసీపీని ఓడించి టిడిపిని గెలిపించారు. అయితే ఇలా గెలిచినప్పటికీ అటు కార్యకర్తలలో కానీ ఎమ్మెల్యేలలో కానీ ఎక్కడ సంతృప్తి కనిపించడం లేదట.

తమలో తమ పరిస్థితి ఏంటో తెలియక అటు కార్యకర్తలు నేతలు మదన పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. పదికి పది సీట్లు క్విన్ స్విప్ చేసిన టిడిపి.. అలాగే ఒక ఎంపీగా గెలిచివ్వడంతో కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర మంత్రి పదవి కూడా ఇచ్చారట.. అక్కడి నుంచి ఇంకేదో సాధించలేకపోయామని ఆవేదన కనిపిస్తోందట. గత ఐదేళ్లు ఇబ్బందులు పడ్డ కార్యకర్తలు నాయకుల బాధని అధిష్టానం అసలు పట్టించుకోవడంలేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. చేతికి అధికారం వచ్చిన కూడా తమ అధికారాన్ని చలాయించుకోలేని పరిస్థితి ఏర్పడిందట.

ఎమ్మెల్యేలతోపాటు ,ద్వితీయ శ్రేణి నేతలు ఈ విషయం పైన నిరుత్సాహంతో ఉన్నారట .అంతేకాకుండా జిల్లాకు చెందిన ఒక ముఖ్య నేత అధికారులను కట్టుదిడం చేయడంతో గెలిచిన ఆనందం అసలు కనిపించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా గెలిచి ఇప్పటికి 40 రోజులు కావస్తువున్న తమకు కావలసిన అధికారులను నియోజవర్గానికి తెప్పించుకోలేకపోయాం అంటూ ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అచ్చెన్నాయుడు వంటి వారు గత ప్రభుత్వంలో పని చేసిన వారిని స్థానస్థలం కల్పించారు టెక్కలిలో.

అంతేకాకుండా జిల్లాలో మరో ముఖ్యమైన నేత తనకు తెలియకుండా ఎటువంటి మార్పులు చేయకూడదు అంటూ కూడా అక్కడివారిని సైలెంట్ గా ఉండేలా చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కొంతమంది నేతలు కూడా అసహనంతో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బదిలీలు జరిగే వరకూ వేచి చూడాలంటూ క్యాడర్ నచ్చ చెబుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: