ఏపీ అసెంబ్లీ: పద్మవ్యూహంలోకి అడుగుపెట్టబోతున్న జగన్ ...?

FARMANULLA SHAIK
* జగన్ ఎంట్రీ పద్మవ్యూహంలో అభిమన్యుడిలెక్క!

* జగన్ ను రౌండప్ చేయబోతున్న కూటమి

* జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఖాయమంటున్న నేతలు

(అమరావతి-ఇండియా హెరాల్డ్ ): ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ప్రజా ప్రభుత్వంతో కూడిన కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ ఎన్నికల్లో కూటమి 164 సీట్లు సాధిస్తే విపక్ష వైసీపీ మాత్రం కేవలం 11 సీట్లకే పరిమితమైంది. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహించిన మొదటి అసెంబ్లీ సమావేశానికి ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాలి కాబట్టి మాజీ సీఎం జగన్మోహనరెడ్డి రాక తప్పలేదు.ఆయన ప్రమాణం పూర్తి అయిపోయిన వెంటనే అక్కడ నుండి వెళ్లిపోయారు.ముందుగానే కడపవెళ్లే విధంగా అప్పుడు ప్రణాళిక వెస్కొని అసెంబ్లీకి వచ్చారు.ఇప్పుడు రెండో అసెంబ్లీ సమావేశాలు ఈనెల 22న జరగబోతున్నాయి.ఈసారి కూడా అసెంబ్లీకి వస్తారా? రారా? అనే అనుమానాలు ఇప్పటిదాకా ప్రజల్లో ఉండగా ఇటీవల దానిపైన జగనే స్వయంగా స్పందించారు.ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక రాష్ట్రంలో వరుసగా హింసాత్మక ఘటనల్లో భాగంగా చిన్నారులపై అత్యాచారాలు, ఇటీవల జరిగిన రషీద్ హత్య వీటికి నిదర్శనంగా మారాయి. మృతుడి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన జగన్ తన భవిష్య కార్యాచరణపై క్లారిటీ ఇచ్చారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు తాను హాజరుకానున్నట్లు చెప్పారు. అయితే అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలోనే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే సమయంలో తప్పకుండా అడ్డుతగులుతామన్నారు.రాష్ట్రంలో శాంతిభద్రతలపై గవర్నర్ ను నిలదీస్తూ, వైసీపీ గళం విప్పుతుందన్నారు.గవర్నర్ ప్రసంగం వరకు సభలో ఉండి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.తర్వాత రోజు ఢిల్లీకి తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల్ని తీసుకుని వెళ్లి నిరసన చేపడతామని తెలిపారు.
ప్రస్తుతం జగన్కు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాకూడా దక్కలేదని దానికి సంబంధించి ఇటీవల స్పీకర్ అయ్యన్నకూ లేఖ కూడా రాసారు కానీ దానిపై ఆయనకు ఎలాంటి రెస్పాన్స్ అందకపోవడం పై జగన్ కూ ప్రతపక్ష హోదా లేదని తెలుస్తుంది.సోమవారం జరగబోయే అసెంబ్లీ సమావేశాలు అయిదు రోజులు జరగనున్నాయి.మరి అయిదు రోజులు జగన్ బృందం సమావేశాలకు వస్తే మాత్రం కూటమి నేతలకు ఆహారం అవ్వాల్సిందే. గత ప్రభుత్వంలో చంద్రబాబును వైసీపీ నేతలు టార్గెట్ చేసిమరీ ఇబ్బంది పెట్టారు. దాంతో చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా సవాల్ చేసి మరి బయటకి వెళ్లారు. మరి జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే విధంగా కూటమి నేతలు సిద్ధంగా ఉన్నారు. మరీ ఇవన్నీ తెల్సి కూడా జగన్ అసెంబ్లీ లో తనకున్న తక్కువ మంది సంఖ్య బలంతో కూటమి ఎమ్మెల్యేలను ఏవిధముగా ఎదురుకుంటారో చూడాలి మరీ.అయితే జగన్ అసెంబ్లీకి వెళ్లి ఎన్నికలప్పుడు చెప్పిన హామీల సంగతేంటి ? ప్రతి నెల 1500 అక్కచెల్లెమ్మలకు ఇస్తామన్నారు. బడికి వెళ్లే పిల్లలకు రూ.15 వేల చొప్పున ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి రూ.3వేలు ఇవ్వాలి అని జగన్ డిమాండ్ చేయాబోతున్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం జగన్ చంద్రబాబు ప్రభుత్వానికి చెక్ పెట్టి రాష్ట్రపతి పాలన తెచ్చేలా ముందుడుగు వేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపై సీఎం చంద్రబాబు సెటైర్లు కూడా వేసిన సంగతి తెల్సిందే.ఏదేమైనా జగన్ అసెంబ్లీ ఎంట్రీ అనేది పద్మవ్యూహంలో అభిమన్యుడి లెక్కే నని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: