బిఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. వాళ్లు కూడా జంప్?

praveen
తెలంగాణ తెచ్చిన పార్టీగా కొనసాగుతున్న బిఆర్ఎస్ పార్టీకి ఒక్కసారి ప్రతిపక్షంలోకి రాగానే గత కొంతకాలం నుంచి విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఏకంగా పార్టీలోని కీలక నేతలందరూ కూడా కారు పార్టీకి గుడ్ బై చెప్పి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కడియం శ్రీహరి, కేకే లాంటి కీలక నేతలు పార్టీని విడటమేకాకుండా.. ఇక పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎంతో మంది సిట్టింగులు సైతం కారు పార్టీ నుంచి జంప్ అయ్యారు. దీంతో ఇక బిఆర్ఎస్ పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది అని చెప్పాలి. ఆ పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యే అవకాశం ఉందని అందరూ అంచనా వేస్తున్నారు.

 ఈ క్రమంలోనే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీ తరపున గెలిచిన 9 మంది ఎమ్మెల్యేలు కూడా అటు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ పార్టీకి వరుసగా షాకులు తాగుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక ఎప్పుడు ఎవరు ఇలా పార్టీ నుంచి జంప్ అవుతారు అనే విషయం తెలియక గులాబీ దళపతి కేసీఆర్ కూడా తల పట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇలా జంపింగ్ లకు రెడీగా ఉన్న నేతలను అటు కేసీఆర్ ఎలా ఆపబోతున్నారు అనే విషయంపై కూడా చర్చ జరుగుతూ ఉంది అని చెప్పాలి. అయితే ఇప్పటికే ఎమ్మెల్యేల జంపింగ్లతో అటు బిఆర్ఎస్ కి వరుసగా షాక్ లు తగులుతూ ఉండగా.. ఇక ఇప్పుడు మరో షాప్ తగిలింది అన్నది తెలుస్తుంది.

 జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం లో ఇలా కారు పార్టీకి షాక్ తగిలింది. కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య తన భర్తతోపాటు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజకవర్గ ఇన్చార్జ్ జువ్వాడ నరసింహారావు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వారితో పాటు మరో ఆరుగురు పట్టణ కౌన్సిలర్లు కూడా ఇలా బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం గమనార్హం. అయితే వీరి చేరికతో ఆ జిల్లాలో అటు బిఆర్ఎస్ మరింత బలహీన పడింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Tg

సంబంధిత వార్తలు: