ఏపీ: జెసి ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక.. తాడిపత్రి లోకి పెద్దారెడ్డి ఎంట్రీ..!

Divya
రాయలసీమలోని తాడిపత్రి నియోజవర్గం ఎప్పుడూ కూడా రాజకీయపరంగా హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. అయితే నిన్నటి రోజున మాజీ వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కి  పైన జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది.. అలా వార్నింగ్ ఇచ్చిన మరుసటి రోజు గడిచిన కొన్ని నిమిషాల క్రితం కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి ఎంట్రీ ఇచ్చారు. ఎన్నికలలో ఓటమి తర్వాత కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి దూరంగా ఉన్నారు. ఉన్నట్టుండి ఈరోజు ఉదయం తాడిపత్రి పట్టణంలోకి రావడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు.

ఎన్నికల పోలింగ్ మరుసటి రోజు జరిగిన ఘటనలో కూడా కండిషన్ బెయిల్ కు  సంబంధించిన సంతకాలు పెట్టడానికి పోలీస్ స్టేషన్కు పెద్దారెడ్డి వచ్చినట్లు తెలుస్తోంది. పెద్దారెడ్డి తాడిపత్రికే వస్తే పంచ ఊడదీసి కొడతాను అంటూ జేసి ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. దీంతో ఆయన మాటలకు స్పందించిన పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చారు అనే విధంగా వార్తలు వినిపించాయి. కానీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి కేవలం కండిషన్ బెయిల్ పై స్టేషన్లో సంతకం పెట్టి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో తాడిపత్రిలోని ప్రజలు పోలీసులు సైతం కాస్త ఊపిరి పీల్చుకున్నట్లు తెలుస్తోంది

స్టేషన్లో సంతకం అనంతరం పెద్దారెడ్డి వెంటనే తాడిపత్రి నుంచి అనంతపురానికి వెళ్లిపోయారట. పెద్దారెడ్డి వాహనాలను కూడా పోలీసులు కొద్ది దూరంలో వరకు ఫాలో అయినట్లు సమాచారం. మరొకవైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వచ్చిన విషయం తెలుసుకొని జెసి వర్గీవుల సైతం ఘర్షణలకు పాలు పడతారని పోలీసులు భయాందోళన చెందారు. కానీ జెసి వారి వర్గ్యుల నుంచి కూడా ఎలాంటి అలజడు లేకపోవడంతో పోలీసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.. వైసిపి హయాంలో పెద్దారెడ్డి హవా తాడిపత్రిలో బాగా జరిగిందని చెప్పవచ్చు. కానీ ఈసారి ఎన్నికలలో వైసీపీ పార్టీ నుంచి ఓడిపోవడం జరిగింది పెద్దారెడ్డి.. మరి రాబోయే రోజుల్లో తాడిపత్రిలో మరి ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: