ఆంధ్ర ప్రదేశ్: రైతు భరోసా పెంచడం.. రైతులకు వరమే..!

Divya
•రైతు భరోసా పెంపు.. రైతులకు వరం
•ఏడాదికి 20,000.. ఐదేళ్ల పరిపాలనలో లక్ష రూపాయలు
•కూటమి ప్రభుత్వ నిర్ణయాలు రైతులకు పూర్తి భరోసా..

(ఆంధ్ర ప్రదేశ్ - ఇండియా హెరాల్డ్)

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని పెద్దలు చెప్పిన విషయం తెలిసిందే.. ముఖ్యంగా రైతు ఇబ్బందుల్లో పడితే మాత్రం అందరూ మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.. అయితే ఈ మధ్యకాలంలో వర్షాలపైన ఆధారపడి పంటలు వేసుకుంటున్న రైతులకు నిరాశ మిగులుతోందని చెప్పాలి. సకాలంలో వర్షాలు పడక,  పెట్టిన పంట చేతికి అందక,  రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ సరైన సమయంలో వర్షాలు పడినా,  పంటకు గిట్టుబాటు ధర లభించక అప్పులను తీర్చుకోలేక ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అందుకే రైతుల ఆత్మహత్యలను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.. అందులో భాగంగానే రైతుల రుణమాఫీ , రైతు భరోసా పెట్టుబడి సహాయం కింద పథకాలను రైతులకు అందజేస్తూ వారికి ఊరట కలిగిస్తున్నారని చెప్పవచ్చు.
ముఖ్యంగా పంట నష్టపోయినప్పుడు ఇన్సూరెన్స్ పేరిట ప్రతి సంవత్సరం నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందించాల్సి ఉంటుంది. అలాగే నష్టపరిహారం, కరువు భత్యం ఇలాంటివి రైతులను ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడేస్తాయని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు రైతు భరోసా పెంచి మరింత ఊరట కలిగించారని చెప్పవచ్చు . గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసాను రాష్ట్ర ప్రభుత్వం రూ.7, 500 కేంద్ర ప్రభుత్వం 6000 రూపాయలను మొత్తం 13,500 అందించేవారు.. అయితే ఇప్పుడు దానిని ఏకంగా రూ.6,500 పెంచి రూ.20 వేలకు చేశారు  కూటమి ప్రభుత్వం.. పెట్టుబడి సహాయం కింద అందించే ఈ డబ్బు రైతులకు ఆర్థికంగా ఆదుకుంటుందనటంలో సందేహం లేదు. ముఖ్యంగా 20 వేల రూపాయల్లో 6000 కేంద్రం అందిస్తూ ఉండగా.. అందులో 14 వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది.
ఇందులో భాగంగానే రెండు విడతల్లో రూ.5000 చొప్పున రైతుల ఖాతాలో డబ్బు జమ చేయగా.. చివరిలో రూ.4000జమ చేస్తారట. అయితే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. కేంద్ర ప్రభుత్వం కూడా రైతు భరోసాను పిఎం కిసాన్ పేరిట అందజేస్తూ ఆ నిధులను ఇప్పుడు పెంచే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో రూ .2000 గనుక పెంచినట్లయితే రైతులకు ప్రతి సంవత్సరం 22 వేల రూపాయలు లభిస్తాయి. మరొకవైపు ప్రతి ఏడాది 20వేల రూపాయలు వచ్చినా ఐదు సంవత్సరాల కు లక్ష రూపాయలు అవుతుంది.. ఒకరకంగా ఇది రుణమాఫీతో సమానం అని చెప్పవచ్చు. మరి కూటమి తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా రైతుల వరమే అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: