తెలంగాణ: రుణమాఫీతో జనాల పల్స్ పట్టేసిన రేవంత్?

Purushottham Vinay

• రుణమాఫీలో సెన్సేషనల్ రికార్డ్ కొట్టబోతోన్న తెలంగాణ
• రుణమాఫీ నిర్ణయంతో తక్కువ టైంలోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న రేవంత్

తెలంగాణ - ఇండియా హెరాల్డ్: దేశవ్యాప్తంగా కూడా 2017 వ సంవత్సరం నుంచి వివిధ రాష్ట్రాలు రూ.2.80 లక్షల కోట్ల పంట రుణాలను మాఫీ చేయడం జరిగింది. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, కర్నాటక, పంజాబ్ ఇంకా అలాగే జార్ఖండ్ తదితర రాష్ట్రాలు 11 విడతల్లో రుణమాఫీ అమలు చేశాయి. ఈ మేరకు ఎకోరాప్ అనే సంస్థ తన రిపోర్టులో వెల్లడించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షల దాకా ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తున్న నేపథ్యంలో ఎకోరాప్ ఈ రిపోర్టును విడుదల చేయడం జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కేవలం ఏడు నెలల్లోనే దాదాపు 39 లక్షల మంది రైతులకు చెందిన రూ.31వేల కోట్ల రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తు ప్రజల మన్నన పొందుతున్నది. ఇదే రేవంత్ రెడ్డికి సూపర్ పాజిటివిటీ తెస్తున్నది.ఇందులో భాగంగా ఇప్పటికీ తెలంగాణ సర్కార్ ఏకంగా రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేసింది. ఇందుకోసం ఏకంగా రూ.6,098.93 కోట్లను రైతుల రుణ ఖాతాల్లో జమ చేసింది. ఈ ప్రక్రియ మొత్తం కనుక పూర్తయితే ఏకకాలంలో రూ.31 వేల కోట్లు మాఫీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ సెన్సేషనల్ రికార్డు సృష్టించనుంది.

దేశంలో ఇప్పటి దాకా ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి మాఫీ చేయలేదు.ఇప్పటి దాకా అత్యధిక మొత్తంలో రుణాలను మాఫీ చేసిన ఘనత దేశంలో మహారాష్ట్రకు దక్కుతుంది. ఆ రాష్ట్రం 2017 నుంచి 2020 దాకా రూ.79 వేల కోట్లు రుణాలు మాఫీ చేసి మొదటి స్థానంలో దూసుకుపోతూ ఉన్నది. ఆ తర్వాతి స్థానం తెలంగాణ రాష్ట్రం దక్కించుకున్నది. గతంలో బీఆర్ఎస్ 2014 వ సంవత్సరంలో నాలుగు దఫాల్లో మొత్తం రూ.16,162 కోట్లు మాఫీ చేసింది. మళ్లీ 2018 నుంచి 2023 దాకా పలు దఫాల్లో రూ.11,600 కోట్లు మాఫీ చేసింది. ఇక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో ఏకంగా రూ.31 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేస్తున్నది. ఇది పూర్తయితే తెలంగాణ రాష్ట్రంలో రూ.58,762 కోట్ల పంట రుణాలు మాఫీ అవుతుంది. ఏది ఏమైనా ఏక కాలంలో అన్ని వేల కోట్లు రుణ మాఫీ అంటే మామూలు విషయం కాదు. దీంతో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణాలో సూపర్ పాజిటివిటీ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: