రుణమాఫితో ఋణం తీర్చుకున్న రేవంతన్న...?

FARMANULLA SHAIK
* అట్టహసంగా జరిగిన రుణమాఫీ తంతు
* అన్నదాతను ఆదుకున్న రేవంత్ సర్కార్.!
* 'రైతే రాజు' గా ఇందిరమ్మ రాజ్య లక్ష్యం
(తెలంగాణ- ఇండియహెరాల్డ్ ) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు భారీ విజయాన్ని అందుకొని సీఎం అయ్యారు.కానీ దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించారు. అప్పటినుండి ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించే సరైన నాయకుడు కాంగ్రెస్ అధిష్టానానికి దొరకలేదు.అప్పుడు అదే అదునుగా చేసుకొని కేసిఆర్ అలాగే మరికొందరు కలిసి తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు.కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి చివరికి ఉమ్మడి ఆంధ్రను విభజించారు.అయితే విభజిత తెలంగాణకి మొదటిసారి 2014 ఎన్నికలు జరగ్గా కేసిఆర్ భారీ విజయాన్ని అందుకున్నారు. కేసిఆర్ తన అయిదేళ్ల పాలనలో ప్రజలచేత శభాష్ అనిపించుకునేలా పాలనా చేశారు. దాని ప్రతిఫలమే 2019 ఎన్నికల్లో కూడా మరల కేసిఆర్ సీఎంను చేసింది.2014లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి, అసలు, వడ్డీ చెల్లిస్తామని హామీ ఇచ్చి నాలుగైదు విడతల్లో చేసిందని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. 2018 లో రెండోసారి అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తయినా హామీని నెరవేర్చలేకపోయారన్నారు. మొదటి ఐదేళ్లలో రూ.12 వేల కోట్లు మాత్రమే చెల్లించిందని చెప్పారు. రెండో దఫా అధికారంలోకి వచ్చాక రూ.16 వేల కోట్లకు గాను రూ.9 వేల కోట్లు కూడా సరిగా చెల్లించలేదని అన్నారు. పదేళ్ల పాలనలో 21 వేల కోట్ల రూపాయల మాఫీ కూడా సక్రమంగా చేయలేక పోయారని చెప్పారు.కానీ రెండో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని అంతర్గత కారణాల వల్ల, హామీలు అమలుపరచడంలో విఫలం అవ్వడం వల్ల ఈసారి ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. దాంతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ చేసిన ఆరు గ్యారెంటీల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది రేవంత్ సర్కార్.వాటికి తోడు రైతు రుణ మాఫీ వాగ్దానాన్ని కూడా అమలు చేస్తున్నామని చెప్పి శుక్రవారం నాడు కార్య రూపం దాల్చింది.ఇందిరమ్మ రాజ్యంలో రైతును రాజుగా చూడాలనే గొప్ప లక్ష్యంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రైతుల కుటుంబాలలో చెప్పలేని సంతోషం కనబడుతుంది.ఈ ఋణ మాఫికి సంబంధించి మే 6, 2022న వరంగల్ సభలో రాహుల్ గాంధీ తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఏక కాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాం. మొదటి విడతగా ఈ రోజు రాష్ట్రంలోని 10లక్షల రైతు కుటుంబాలకు చెందిన 12లక్షల మంది రుణ ఖాతాల్లో రూ.6,098.93 కోట్లను జమ చేశాం. ఆగస్టులోపు రెండు విడుతల్లో మిగతా మొత్తాన్ని చెల్లించి రైతులను రుణ విముక్తుల్ని చేస్తామని మేము అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో రైతులకు రుణమాఫీ చేసి దేశానికే ఆదర్శంగా నిలిచామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.అలాగే రుణమాఫీకి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదని, రుణమాఫీకి పాస్ బుక్‌నే కొలబద్ద అని ముఖ్యమంత్రి మరోసారి స్పష్టం చేశారు. భూమి ఉండి, ఆ భూమికి పాసు బుక్ ఉండి, పాసు బుక్‌పై రుణం తీసుకుంటే దానిని మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి వివరించారు. దీనిపై అవగాహన కల్పించాలని ఆయన అధికారులు, రైతు వేదికల్లోని రైతులను కోరారు. రుణమాఫీకి సంబంధించి విద్యలేని, సాంకేతిక నైపుణ్యం లేని రైతులెవరికైనా సమస్యలు తలెత్తితే బ్యాంకు అధికారులను సంప్రదించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.ఈవిధంగా చెప్పిన మాట చెప్పినట్టుగా అమలు చేసి ఎందరో రైతు కుటుంబాల్లో సంతోషాన్ని నింపిన రేవంతన్న తనను గెలిపించినందుకు రైతుల రుణాన్ని ఈవిధంగా తీర్చినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: