ఏపీ: కూటమినేతలకు ఆనందం.. బాబుకు మాత్రం తలనొప్పి..!

Divya
కూటమిలో భాగంగా 2024 లో అధికారంలోకి వచ్చిన టిడిపి ,బిజెపి ,జనసేన పార్టీలో సంబరాలను మునిగి తేలుతున్నారు.. అయితే కొంతమంది గెలిచిన నాయకులు సైతం వారి వ్యక్తిగత విషయాలను తెరమీదకి తీసుకువస్తూ మానసికంగా ఆనందాన్ని పొందుతున్నారు. వీటివల్ల చంద్రబాబుకు ఇబ్బందులు తలెత్తేలా కనిపిస్తున్నాయట. వాస్తవానికి ప్రభుత్వం వచ్చి కేవలం నెలరోజుల పైన కావోస్తోంది.. ఈ విషయాన్ని మర్చిపోయిన కొంతమంది తెలుగు తమ్ముళ్లు పార్టీని సైతం ఇబ్బంది పెట్టాలా పనులు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలకి అవకాశం కల్పించేలా కొంతమంది నేతలు వ్యవహరిస్తున్న తీరు కూటమిని అసంతృప్తికి గురిచేస్తుందట.

సీనియర్ నేతలు సైతం తమ వ్యక్తిగత ఆనందం కోసం చిన్న చిన్న తప్పులు చేస్తున్నారట. జెసి ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు. ఈయన కుమారుడు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ వీరు కోరుకున్నది జరుగుతుంది.. దీంతో వైసిపి నాయకులను నియోజవర్గం నుంచి తరిమి కొట్టడం వంటివి చంద్రబాబు చేస్తారో లేదో అంటూ మీడియా ముఖంగానే మాట్లాడడం జరిగింది.లేకపోతే తామేరంగంలోకి దిగుతామంటూ స్వయంగా ఆయనే మాట్లాడినట్లు సమాచారం. దీంతో వైసిపి నేతలను టార్గెట్ చేయడంతో తాడిపత్రిలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.

అలాగే పరిటాల శ్రీరామ్ ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన రాప్తాడు ఎమ్మెల్యే సునీతమ్మ కుమారుడే.. ఈయన కూడా మీడియా ముందు మానసిక ఆనందం కోసం కొన్ని వాక్యాలు చేశారు.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి పై 307 బుక్ చేయాలని ఎన్నికల ముందు తమ వారి పైన దాడులు చేశారని దీనిపైన కేసులు ఇప్పటికే నమోదయ్యాయి. విచారణ కూడా జరుగుతోందనీ పోలీసులు తెలియజేసిన శ్రీ రామ్ మాత్రం తన దూకుడుని ప్రవర్తిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అలాగే ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు కూడా గతంలో వైసీపీ పార్టీలో ఉన్నారు. అప్పుడు కూడా చంద్రబాబును పరోక్షంగా టార్గెట్ చేసి ఆ తర్వాత వైసీపీ పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత.. నానా హంగామా చేస్తూ ఇప్పటికీ కూడా జగన్ పైన విరుచుకుపడుతున్నారు. అంతేకాకుండా rrr ఐపీఎస్ అధికారుల పైన కేసులు పెట్టాలని చూస్తున్నారు.

అయితే ఇది సాధ్యమేనా అనుకుంటే సాధ్యం కాదనే విధంగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.. ఇలాంటి పనులన్నీ సాధ్యం కావని తెలిసినా కూడా ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టేలా ఈ నేతలు కాకుండా మరి కొంతమంది కూడా వ్యవహరిస్తున్నారు. అంతే కాకుండా జనసేన పార్టీ నేతలు కూడా నానా హంగామా చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: