ఏపీ: ప్రభుత్వం వద్ద ఖజానా లేదు.. తిప్పలు తప్పవు.. టిడిపి మంత్రి..!

Divya
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కావస్తూ ఉన్న ఇప్పటికే చాలా పనులు చేయడం జరిగింది. కానీ మిగతా పథకాలను అమలు చేయాలి అంటే చాలా ఇబ్బందులు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలకమైన వ్యాఖ్యలు చేశారు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికంగా ఎదగాలి అంటే మరో రెండేళ్లు సమయం పడుతుంది సంపద సృష్టి అన్నది ఓవర్ నైట్ కి రాదు కదా వాటి ఫలితాలు రావడానికి చాలా సమయం పడుతుంది ప్రస్తుతం ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ దగ్గర పైసలు లేవంటూ తెలిపారు.

మున్సిపల్ ఖజానాను గత సర్కార్ పూర్తిగా ఖాళీ చేసింది అంటూ తెలియజేశారు మంత్రి నారాయణ. కనీసం వసతులు కల్పించేందుకు కూడా డబ్బులే లేవని నిధుల కోసం సీఎం చంద్రబాబుని విజ్ఞప్తి చేస్తున్నామంటూ తెలియజేశారు.. అలాగే మరొకవైపు ఢిల్లీకి వెళ్లిన సత్యకుమార్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, అలాగే అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ రాష్ట్రానికి సహాయం కావాలి అంటూ వినతి పత్రాలను కూడా సమర్పిస్తూ ఉన్నారని తెలిపారు మంత్రి నారాయణ.. ప్రస్తుతం ఉన్న ఆర్థిక వరణరులతో రాష్ట్రాన్ని ముందుకు నెట్టుకు వెళ్లడం కాస్త ఇబ్బందిగానే ఉన్న తీసుకువెళ్తామని తెలిపారు.

సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి వల్లే ఇది సాధ్యమవుతుందని కూడా తెలిపారు.. ఒకవైపు సంక్షేమం మరొకవైపు అభివృద్ధి ఇలా సమపాలనలో ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని అందుకే ఆయన చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు మంత్రి నారాయణ. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలలో ఫర్నిచర్ కొనుగోలును బ్యాన్ చేశారని దీని ద్వారా ఎలాంటి ఆర్భాటాలకు వెళ్ళకూడదని ఉన్నంతలో సర్దుకోవాలి అంటూ కూడా తెలియజేస్తున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికంగా ముందుకు సాగాలి అంటే మరో రెండేళ్ల సమయం పడుతుంది అంటూ మంత్రి నారాయణ తెలిపారు. ప్రతి ఇంటికి 24 గంటలు తాగునీరు, మురికి కాలువల నీరు నిర్మించాల్సి ఉందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: