జగన్ కు షాక్... YSR పేరును తీసేసిన చంద్రబాబు ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... మొన్న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాగానే... చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి తన మార్కు పాలన చూపిస్తున్నారు. ముఖ్యంగా వైసిపి నేతలపై ప్రతికాలం తీర్చుకునేందుకు.... చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే... వైసిపి కార్యాలయాలను చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్ చేసింది.
 

అలాగే ఎక్కడైతే ఎన్టీఆర్ పేరును... తొలగించి వైయస్సార్ పేరును పెట్టారో... మళ్లీ... అక్కడ ఎన్టీఆర్ పేర్లను పెడుతున్నారు చంద్రబాబు నాయుడు. అలాగే... జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన చాలా సంక్షేమ పథకాల పేర్లు కూడా మార్చేశారు చంద్రబాబు నాయుడు. ఇలాంటి నేపథ్యంలో వైసీపీ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇటీవల ఆరోగ్యశ్రీ పేరును మార్చుతున్నట్లు ప్రకటించిన కూటమి ప్రభుత్వం... డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు  పేరును తెరపైకి తీసుకువచ్చింది.

ఆరోగ్య శ్రీ ట్రస్ట్ కు నందమూరి తారక రామా రావు వైద్య సేవగా పేరు మార్చుతూ... తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబుకు ప్రభుత్వం. ఈ మేరకు వైద్య అలాగే ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణ బాబు... ఈ ఉత్తరులను జారీ చేయడం జరిగింది. దీంతో ఇకనుంచి ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో... సేవల నిర్వహించనుంది చంద్రబాబు కూటమి ప్రభుత్వం.

అయితే దీనిపై వైసీపీ పార్టీ తీవ్రంగా మండిపడుతోంది.అసలు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని చేపట్టిందే వైయస్సార్ అని... పేద ప్రజల కోసం వైయస్ రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చిన ఆ పథకానికి... పేరు మార్చడం ఏంటని మండిపడుతోంది వైసిపి. అటు కాంగ్రెస్ నేతలు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పథకాల పేర్లు మార్చడం ఎందుకు... మంచి పాలన అందిస్తే చాలు అంటూ చురకాలు అంటిస్తున్నారు. జగన్ చేసిన తప్పులే చంద్రబాబు చేస్తు న్నారని ఆగ్రహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: