మోదీ కొత్త చట్టాలు.. ఎంత వరకూ మేలు చేస్తాయో?

Chakravarthi Kalyan
ఇటీవలే కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కొన్ని రోజుల క్రితం వరకు ఎన్నికల హడావుడి బాగా సాగింది. దాదాపు రెండు నెలల పాటు ఈ సంగ్రామం జరిగింది. గతం కంటే తక్కువ స్థానాలు వచ్చినా ముచ్చటగా మూడో సారి ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో గతంలో ఎన్డీయే ప్రభుత్వం మూడు కీలక చట్టాలను చేసింది. తాజాగా ఇప్పుడు వాటిని అమలు చేస్తున్నారు.

జులై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు అమల్లోకి వచ్చాయి. భారతీయ న్యాయ సంహిత-2023, భారతీయ సాక్ష్య అధినయమ్-2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత-2023 అనే మూడు చట్టాలకు సంబంధించి గత ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టింది. ఈ చట్టాలకు గత డిసెంబరు  లో ఆమోదం లభించింది. వీటికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర కూడా వేశారు.

గత బ్రిటీశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టాల స్థానంలో కొత్తగా ఈ నేర చట్టాలను కేంద్రం తీసుకువచ్చింది. ఇక ఈ కొత్త చట్టాల్లో అనేక మార్పులు చేశారు. జీరో ఎఫ్ఐఆర్, ఆన్ లైన్ లో పోలీసులకు ఫిర్యాదు, ఎలక్ర్టానిక్ రూపంలో సమన్లు, దారుణమైన నేరాలకు సంబంధించి నేరం జరిగిన ప్రదేశాన్ని తప్పనిసరిగా వీడియో తీయడం వంటి కీలక అంశాలు ఈ కొత్త చట్టాల్లో ఉన్నాయి. ఇక పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే ఆన్ లైన్ లో ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.

దీంతో తేలికగా.. వేగంగా ప్రజలు తమ సమస్యను పోలీసులకు తెలియజేయవచ్చు. ఇప్పటికే పోలీసులకు కొత్త చట్టాలపై అవగాహన కల్పించేందుకు శిక్షణ సైతం ఇచ్చారు. మొత్తంగా జులై 1 నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి. అయితే ఈ చట్టాను అమలుపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు అయింది. ఈ మూడు చట్టాల సాధ్యాసాధ్యాలపై అంచనా వేసేందుకు తక్షణమే నిపుణుల కమిటీని నియమించాలని పిటిషనర్ కోరారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: