ఏపీ: ఐ బాబోయ్ పోలీసులకే రక్షణ లేదా.. పోలీస్ పై దారుణంగా కర్రతో దాడి..!
అసలు విషయంలోకి వెళ్తే ఇద్దరు పోలీసులు ఒకే బైకు మీద ఒక షాపు దగ్గరికి వచ్చి ముందుగా ఒక కానిస్టేబుల్ బైక్ దిగి షాప్ బయట నిలబడి ఉండగా ఇంతలో వెనుక నుంచి ఒక వ్యక్తి పెద్దకర్రతో ఆ కానిస్టేబుల్ పైన సడన్గా దాడి చేశారు. దీంతో ఆ కర్ర తో కానిస్టేబుల్ ని బలంగా కొట్టడంతో ఒక్కసారిగా ఆ కానిస్టేబుల్ కింద పడిపోయారు.. అలా కింద కానిస్టేబుల్ ను చూసిన ఆ వ్యక్తి కోపం చల్లారక మళ్ళీ అతడి పైన దాడి చేశారు దీంతో కర్రలతో ఎన్నోసార్లు కొట్టబోయాడు ఇంతలో అలర్ట్ అయిన మరొక పోలీస్ వెంటనే వచ్చి ఆ వ్యక్తిని గట్టిగా పట్టుకున్నారు.
అందుకు సంబంధించిన ఈ వీడియో వైరల్ గా మారుతోంది .దీంతో వెంటనే అక్కడికి స్థానికులు వచ్చి ఆ వ్యక్తిని అడ్డుకోవడంతోపాటు దాడిలో కానిస్టేబుల్ కు తీవ్రమైన గాయాలైనట్లుగా కనిపించడంతా స్థానికులు వెంటనే ఆయనను హుటాహుటిగా ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ దాడి చేసిన వ్యక్తి ఎవరా అని పోలీసులు ఆరా తీయగా ఆ వ్యక్తి లత్తు కలిండిగా పోలీసులుగా గుర్తించారు. అయితే ఈయన వెస్ట్ బెంగాలికి చెందిన వ్యక్తి అని ఒక సైకో అంటూ అక్కడ స్థానికులు సైతం తెలియజేస్తున్నారు.
కానీ కానిస్టేబుల్ పైన ఈ దాడి చేయడం ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా మరొకసారి కలకలాన్ని రేపుతోంది.. ఆంధ్రప్రదేశ్లో పోలీసులకే రక్షణ లేదా అంటే కామెంట్స్ చేస్తున్నారు..అయితే ఆ సైకో.. పోలీస్యూనిఫాం లో ఉన్న వారిని చూస్తే ఉన్మాదిగా మారిపోయి మరి దాడి చేస్తారని అక్కడ స్థానికులు తెలుపుతున్నారు..