కూటమి సర్కారైనా వెలిగొండకు మోక్షం కలిగించేనా..?

murali krishna
* దశాబ్దాలుగా సాగు నీటి కోసం ప్రకాశం రైతుల ఎదురుచూపులు
* ప్రాజెక్ట్ పూర్తి కాకుండానే ప్రారంభించిన వైసీపీ సర్కార్
* కూటమి సర్కారైనా నీరు అందించేనా ?

ఆంధ్రప్రదేశ్ లోని  ప్రకాశం జిల్లా  రైతాంగం గత కొన్ని దశాబ్దాలుగా సాగు నీటి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి అయితే వారి కస్టాలు తీరుతాయి.అయితే గత కొంతకాలంగా రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నాయి గాని ప్రాజెక్ట్ మాత్రం పూర్తి కావడం లేదు.ప్రకాశం జిల్లాకు కృష్ణా నది జలాలను తరలించి సాగు ,తాగు నీటి సమస్య లేకుండా సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో 1994 లో వెలిగొండ ప్రాజెక్ట్ నివేదికను సిద్ధం చేసారు.1996 మార్చి 5 న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటిసారి ఈ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేసారు.అయితే శంకుస్థాపన జరిగినంత స్పీడ్ గా ప్రాజెక్ట్ కు నిధులు విడుదల కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ పనులు నిలిచిపోయాయి.2004 లో ముఖ్య మంత్రిగా భాద్యతలు చేపట్టిన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం పేరుతో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టులలో భాగంగా వెలిగొండ ప్రాజెక్ట్ కు వైఎస్ఆర్ మరోసారి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.
కృష్ణా వరదల సమయంలో వందల టిఎంసి నీళ్లు వృధాగా సముద్రంలో కలుస్తుంది.శ్రీశైలం జలాశయం సమీపంలో  సంవత్సరంలో 45 రోజులు వరద ప్రభావం అంచనాతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించారు.శ్రీశైలం  జలాశయం నుంచి వరద జలాల వినియోగానికి వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. ఆ నీటిని నిల్వ చేసేందుకు నల్లమల కొండల మధ్య సుంకేసుల ,గొట్టిపడియా ,కాకర్ల ప్రాంతాల మధ్య ఆనకట్టలు కట్టారు.43 .5 టిఎంసిల నీటిని నింపేందుకు వీలుగా నల్లమల సాగర్ జలాశయాన్ని నిర్మించారు.శ్రీశైలం నుంచి వరద జలాలను తీసుకొచ్చేందుకు రెండు టన్నెల్స్ నిర్మాణం చేపట్టారు.ఈ ప్రాజెక్టును పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ పేరుతో శ్రీశైలం బ్యాక్ వాటర్ ను తరలించాలనేదే లక్ష్యంగా పెట్టుకున్నారు.కమ్యూనిస్ట్ నేత పూల సుబ్బయ్య పోరాట ఫలితముగా ఈ ప్రాజెక్ట్ కార్య రూపం దాల్చింది.దీనితో ఈ ప్రాజెక్ట్ కు పూల సుబ్బయ్య పేరును పెట్టడం జరిగింది.  
ప్రాజెక్ట్ లో రెండు టన్నెల్స్ నిర్మాణాన్నిగత వైసీపీ ప్రభుత్వంలో మేఘ ఇంజనీరింగ్ సంస్థ పూర్తి చేసింది..కానీ నీటి విడుదల మాత్రం నోచుకోలేదు.. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని జగన్ హామీ ఇచ్చారు .కానీ ఈ సారి ఎన్నికలలో కూటమి సంచలన విజయం సాధించింది.డిప్యూటీ సీఎం గా భాద్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసే భాద్యత తాము తీసుకున్నట్లు తెలిపారు.త్వరలోనే ప్రాజెక్ట్ పూర్తి చేసి నీటిని విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.మరి అది ఎప్పటికి కార్యరూపం దాల్చుతుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: