జనసేన: పవన్ ప్రకటన వల్ల.. కలకలం..!

Divya
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిలో భాగంగా అటు జనసేన, బిజెపి, టిడిపి పార్టీలు మూకుమ్మడిగా విజయాన్ని సాధించాయి. దీంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవిని కూడా ఇచ్చారు. అయితే ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ముందు ఎన్నో సవాళ్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగులకు సిపిఎస్ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటామంటూ ప్రకటించారు. అలాగే రాయలసీమకు సంబంధించి సాగునీటి ప్రాజెక్టులు రహదారుల నిర్మాణం విషయంలో కూడా పలు రకాల హామీలు ఇచ్చారు. వీటితోపాటు మహిళా భద్రతకు కూడా పెద్దపీట వేస్తామంటూ ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ హామీలు ఇచ్చారు.

అలాగే సుగాలి ప్రీతి కుటుంబానికి కూడా న్యాయం చేస్తామంటూ వెల్లడించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నప్పటికీ నెలరోజులు దాటిన ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పవన్ కళ్యాణ్ ఏ మాత్రం పట్టించుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు గుర్తు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కూటమి ఎన్నికలలో భాగంగా చెప్పినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. ఇప్పటికే పించన్ పెంపు, అన్నా క్యాంటీన్లు మహిళలకు ఉచిత బస్సు ఇతరత్రా హామీలను అమలు చేస్తున్నారు.

అలాగే జనసేన తరఫునుంచి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు సంగతి ఏంటానంటూ పలువురు నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇవే కాకుండా పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా కూడా మరికొన్ని హామీలు ఇచ్చారని  తెలుస్తోంది. ఈ విషయాల పైన అటు జనసేన నాయకులు కార్యకర్తలకు క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి జనసేన కూటమిగా పోటీ చేస్తుందా లేకపోతే ఒంటరిగా పోటీ చేస్తుందా అనే విషయం పైన ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం 2024 ఇచ్చిన ఎన్నికలలో పవన్ కళ్యాణ్ హామీల సంగతి ఏంటా అంటూ ప్రశ్నలు తెరమీదకి వస్తున్నాయి. అయితే ఈ విషయాలను పవన్ కళ్యాణ్ తనకే వదిలేయాలని తానే చూసుకుంటానని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ 2029 ఎన్నికల నాటికి ఈ పనులను పూర్తి చేయకపోతే కచ్చితంగా జనసేన పార్టీ ప్రజలలో విశ్వాసం కోల్పోతుందని పరిస్థితి జనసేన నాయకులనుంచి వినిపిస్తోంది. మరి పవన్ కళ్యాణ్ ఎలా ఆలోచిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: