ఏపీ: పల్నాడులో మరోసారి రాజకీయ కక్ష.. వైసీపీ కార్యకర్త హత్య..!

Divya
ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లాలో మరొకసారి రాజకీయ విభేదాలు భగ్గుమన్నాయి. తాజాగా పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన మర్డర్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అందరూ చూస్తూ ఉండగానే వైసిపి కార్యకర్త రసీదును కత్తితో నడిరోడ్డు మీద నరకడం జరిగింది. ఈ దారుణం చూసిన అక్కడి పరిధిలో ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా నరికేటప్పుడు కాదు గాని ఆ తర్వాత ఆ దృశ్యాలు ఒళ్ళు గగూర్పొడిచెల దృశ్యాలు కనిపిస్తున్నాయి.. నిన్నటి రోజున రాత్రి పని ముగించుకొని ఇంటికి వస్తున్న సమయంతో ఈ దారుణం జరిగినట్టుగా అధికారులు తెలియజేస్తున్నారు.

రసీదు పై ఒక్కసారిగా దాడి చేసిన జిలాని తనతో తెచ్చుకున్నటువంటి కత్తితో ముందుగా చేతులు నరికి ఆ తర్వాత మరో చెయ్యి పైన వెట్ వేశారు. ఆ వెంటనే తల మెడ పైన వేటు వేయడంతో ఒక్కసారిగా రషీద్  కూలిపోయి మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటా హుటీగా అక్కడికి చేరుకునే లోపు కొనఊపిరితో రసీదు ఉన్నారు. వెంటనే ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లుగా పోలీసులు తెలియజేశారు. రసీదును విచక్షణ రహితంగా నరికిన తర్వాతే పోలీసులకు జిలాన్ లొంగిపోయారని తెలుస్తోంది.

పక్క ప్లాన్ ప్రకారమే ఈ దాడి చేశారని కత్తి ఎక్కడ నుంచి సేకరించారు వాటి వెనుక జిల్లా సహకరించింది ఎవరని విషయం ఇంకా తెలియాల్సి ఉన్నది.. ముఖ్యంగా ఈ మర్డర్ కు వ్యక్తిగత కక్షరతో ఏమైనా కారణాలు ఉన్నాయా లేదా అనే విషయం ఇంకా తెలుపలేదు పల్నాడు ఎస్పి. వినుకొండలో ఎలాంటి దర్శనాలు తలెత్తకుండా ప్రస్తుతం 144 సెక్షన్ అమలు చేసినట్లుగా తెలియజేశారు ఎస్పి. వినుకొండ మర్డర్ పైన రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు సోషల్ మీడియా ద్వారా రాష్ట్రపతి ముర్ము  దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లినట్లు సమాచారం. అందుకు సంబంధించి వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: