రవి ప్రకాష్ : RTV పై 100 కోట్ల ప‌రువు న‌ష్టం దావా!?

Veldandi Saikiran
రవి ప్రకాష్... రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. అప్పట్లో టీవీ9 ను... ఓ రేంజ్ కు తీసుకువెళ్లారు రవి ప్రకాష్. టీవీ9 ఛానల్ ఆ స్థాయికి వెళ్లిందంటే దానికి కారణం రవి ప్రకాష్. అసలు న్యూస్ ఛానల్ ను అలా కూడా చూపించవచ్చని... నిరూపించగలిగాడు రవి ప్రకాష్. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత రవి ప్రకాష్.. రకరకాల కేసులో నేపథ్యంలో.. కనిపించకుండా మాయమయ్యారు.
 ఆ తర్వాత తొలి వెలుగు  ను వెనుక ఉండి నడిపించినట్లు వార్తలు వచ్చాయి. ఇక 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు... ఆర్ టీవీ ఛానల్ ఏర్పాటు చేసి... ఇప్పుడు మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అయ్యారు రవి ప్రకాష్. మళ్లీ టీవీ9 రేంజ్ లో... ఆర్ టీవీ ఛానల్ ను తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే రవి ప్రకాష్ చాలా కష్టపడుతున్నారు.
 అయితే అలాంటి రవి ప్రకాష్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఆర్ టి వి ఎడిటర్, పబ్లిషర్ రవి ప్రకాష్ కు లండన్ కు చెందిన యూరో ఎక్స్ సిమ్ బ్యాంకు ఏకంగా 100 కోట్ల పరువు నష్ట దావా వేస్తామని నోటీసులు ఇష్యూ చేసింది.  కొన్ని నిర్మాణ పనులను టెండర్ల లో భాగంగా దక్కించుకున్న మెగా ఇంజనీరింగ్ సంస్థ కు వ్యతిరేకంగా వార్తలు ప్రచురించినందుకుగాను ఈ నోటీసులు జారీ చేసిందట లండన్ బ్యాంక్.
వాస్తవానికి... జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మెగా  ఇంజనీరింగ్ కంపెనీ చాలా పనులను చేపట్టింది. పోలవరంతోపాటు ఇతర పనులను కూడా మెగా ఇంజనీరింగ్ కంపెనీ చేపట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో యూరో బ్యాంకుకు ఏపీ ప్రభుత్వం పలు గ్యారంటీలో ఇచ్చింది.  దీంతో ఆ బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో నిధులను తెచ్చుకొని పనులు చేపట్టింది మెగా సంస్థ.

అయితే ఈ ఒప్పందం పై ఆర్ టి వి.. కొన్ని వార్తలు ప్రసారంచేసింది.భారీ కుంభకోణం పేరుతో.. ఓ కథనం వెలుపడడంతో ఆ బ్యాంకు సీరియస్ అయిందట. ఈ తరుణంలోనే పరువు నష్టం దావా వేస్తామని నోటీసులు ఇష్యూ చేసింది యూరో బ్యాంక్. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలా వార్తలు ప్రసారం చేయడం తప్పని హెచ్చరించిందట. వెంటనే తమకు క్షమాపణలు చెప్పాలని, ఆ వీడియోలను తొలగించాలని.. లేకపోతే 100 కోట్ల పరువు నష్ట ధాబావేస్తామని హెచ్చరించింది. మరి దీనిపై RTV ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: