పార్ల‌మెంటు ఫైట్‌: చిన్నమ్మ పోరాటం...ఏపీ తలరాత మారనుందా?

Veldandi Saikiran

* పురందరేశ్వరితోనే ఏపీకి న్యాయం
* ఏపీ ఎయిర్ పోర్ట్ లపై ఫోకస్
* ఏపీకి ప్రత్యేక నిధులు తేవడం కన్ను
* కేంద్ర మంత్రి కోసం ఎదురు చూపులు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం...  తెలుగుదేశం ప్రభుత్వ దూసుకు వెళ్తోంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో... తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాగా... చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా  బాధ్యతలు స్వీకరించారు. అయితే కేంద్రంలో... తెలుగుదేశం పార్టీ పాత్ర కీలకంగా మారడంతో... ఏపీకి ప్రత్యేకంగా మోడీ ప్రభుత్వం నిధులు ఇస్తుంది. దానికి తగ్గట్టుగానే... బిజెపి ఎంపీ పురందరేశ్వరి కూడా పనిచేస్తున్నారు.
 

మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో... రాజమండ్రి నుంచి పోటీ చేసి గెలిచారు  దగ్గుబాటి పురందరేశ్వరి. ప్రస్తుతం... ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలుగా ఉన్న పురందరేశ్వరి... ఎంపిగా కూడా ఏపీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.  అయితే పార్లమెంట్ సమావేశాలు ఈనెల 20వ తేదీ నుంచి జరగనున్నాయి. ఇలాంటి నేపథ్యంలో... ఆంధ్రప్రదేశ్ కు కావలసిన... నిధులు, ప్రత్యేక  అవసరాల నిధులు, స్పెషల్ ప్యాకేజీ ఇలాంటి వాటిపై ప్రశ్నించేందుకు దగ్గుబాటి పురందరేశ్వరి సిద్ధమయ్యారు.
 గతంలో గతంలో లాగా కాకుండా.. ఈసారి ఏపీకి న్యాయం జరిగేలా... పనిచేస్తున్నారు దగ్గుబాటి పురందరేశ్వరి.  ముఖ్యంగా 20వ తేదీ నుంచి జరిగే పార్లమెంటు సమావేశంలో... ఏపీలో కొత్తగా ఏర్పాటు అయ్యే  ఎయిర్పోర్టులకు ప్రత్యేక నిధులు తీసుకువచ్చేలా ప్లాన్ చేశారట  పురందరేశ్వరి.  అలాగే ఏపీలో ఉన్న పోర్టులను విస్తరించేందుకు కూడా ప్రత్యేక నిధులు అడిగేందుకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేశారట.
 బిజెపి పార్టీలో ఉన్నప్పటికీ... తనకు ఏపీ అభివృద్ధి ముఖ్యమైన లక్ష్యంతో... పురందరేశ్వరి అడుగులు వేస్తున్నారట.ముఖ్యంగా ప్రత్యేక హోదా అవసరాన్ని.. పురందరేశ్వరి లేవనెత్తను ఉన్నారని సమాచారం. అటు ఏపీ రాజధాని కోసం కూడా నిధులు అడగాలని అనుకుంటున్నారట.  ఏపీలో బిజెపి పెద్దదిక్కుగా ఉన్న పురందరేశ్వరి... ఆంధ్రప్రదేశ్ కు ప్రతి అంశంలో న్యాయం చేసేలా ముందుకు వెళ్తున్నారట. ఈసారి ఎలాగైనా... ఏపీకి భారీ ప్యాకేజీ తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: