పార్ల‌మెంటు ఫైట్‌: చక్రం తిప్పుతామన్న టీడీపీ..ఢిల్లీలో చక్కర్లే కొడుతుందా?

Veldandi Saikiran

* కూటమిలో ఉన్న.. ఏపీ కోసం గళం విప్పాల్సిందే  
* ప్రత్యేక హోదా, పోలవరం కోసం టీడీపీ పోరాటం
* పార్లమెంటులో ఏపీ అభివృద్ధి లక్ష్యంగా టిడిపి దుకూడు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత... పరిస్థితి పూర్తిగా మారుతాయి అని అందరూ అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కంటే... ఎక్కువగా ఏపీని అభివృద్ధి చేసే మొనగాడు చంద్ర బాబు అని... ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా.. చంద్రబాబుకు క్రేజ్ ఉందని అందరి నమ్మకం. దాని ఫలితంగానే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో... చంద్రబాబు కూటమి 164 స్థానాలను దక్కించుకుంది.
 అదే సమయంలో...  తెలుగుదేశం పార్టీకి కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం కూడా వచ్చింది. చంద్రబాబు కూర్చోమంటే... ప్రధాని నరేంద్ర మోడీ కూర్చోవాలి.. నిల్చమంటే నిల్చోవాలి.. అలాంటి పరిస్థితి ఇప్పుడు నెలకొంది. అంటే ఢిల్లీలో చంద్రబాబు చక్రం తిప్పే అవకాశం వచ్చిందన్నమాట. ఈ అవకాశం మళ్లీ మళ్లీ రాదు. కాబట్టి ఇదే సమయంలో... ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా, కొత్త రాజధానికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని ఖరాఖండిగా మోడీని అడగాలి.
 అలాగే పోలవరం ప్రాజెక్టు కోసం ప్రత్యేక ప్యాకేజీ, ఏపీలో ఉన్న రోడ్ల కోసం, ఎయిర్ పోర్టుల కోసం నిధులు... సంపాదించుకోవాలి.... గత నెల రోజులు.. చంద్రబాబు నాయుడు ఆ పని చేయడం లేదని కొంత మంది అంటున్నారు. ఈ నెల రోజుల పాటు వైసిపి పార్టీపై ఎలా ప్రతీకారం తీర్చుకోవాలనే దానిపైన చంద్రబాబు ఫోకస్ చేసినట్లు.. ఏపీ ప్రజలకు స్పష్టంగా అర్థం అవుతుంది. ఈ నెల రోజులపాటు చాలాసార్లు ఢిల్లీకి చంద్రబాబు వెళ్లారు.  

ఈ పర్యటనలు కేవలం... మోడీ సీటు కాపాడడం కోసం, కేంద్ర మంత్రి పదవుల కోసం  అటు జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టే ప్రయత్నం కోసం... మాత్రమేనని ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఇప్పటివరకు ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేక హోదాపై చంద్రబాబు.. ప్రశ్నించలేదని కాంగ్రెస్ తో పాటు వైసిపి కూడా మండిపడుతోంది. ఢిల్లీలో చక్రం తిప్పుతానని... చక్కర్లు కొడుతున్నారని  షర్మిల కూడా మండిపడుతోంది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో... ఏపీ సమస్యలపై కచ్చితంగా చంద్రబాబు ఫోకస్ చేసి.. టిడిపి ఎంపీలతో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. ప్రత్యేక హోదా తో పాటు ఇతర... నిధులపై కూడా కేంద్రంతో కొట్లాడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: