పార్లమెంట్ ఫైట్ : స్పెషల్ స్టేటస్ కాకున్నా పన్నుల్లో రాయితీ అయినా వస్తుందా. ?

Pulgam Srinivas
ఈ నెల 20 వ తేదీ నుండి పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. దానితో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా తమ ప్రాంతానికి సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థులు ఎలాంటి విషయాలపై చర్చించి తమకు ఎలాంటి న్యాయాన్ని చేస్తారో అనే విషయంపై ఆలోచిస్తున్నారు. ఇకపోతే 2014 వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కోరుకుంటూ వస్తున్నారు. ఇక 2014 వ సంవత్సరం నుండి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వడానికి పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు.

ఇకపోతే ప్రతిసారితో పోలిస్తే ఈ సారి బిజెపి కి కేంద్రంలో బలం బాగా తక్కువగా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం , జనసేన , బిజెపి మూడు పార్టీలు కలిపి పొత్తులో భాగంగా పోటీ చేశాయి. వీటికి భారీ మొత్తంలో పార్లమెంట్ స్థానాలు వచ్చాయి. దానితో చాలా మంది ఇదే సరైన సమయం కేంద్రంలో బిజెపి కి పెద్దగా బలం లేదు. రాష్ట్రంలో కూటమికి బలం ఉంది. దానితో ఇదే అదునుగా స్పెషల్ స్టేటస్ ను రాష్ట్రానికి తెచ్చుకోవాలి అని చాలా మంది తమ వాదనను వినిపిస్తున్నారు. ఇకపోతే కేంద్రం మాత్రం ఈ ఒక్క రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తే అనేక రాష్ట్రాలు వచ్చి మీద పడతాయి. వాటిని ఇవ్వడం అనేది జరగదు.

అందుకని స్పెషల్ స్టేటస్ ను కాకుండా ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రత్యేక ప్యాకేజీ తో పాటు అనేక పన్నులలో రాయితీని కూడా రాష్ట్ర ప్రభుత్వం నేతలు కోరాలి అని , అలా అనేక పన్నుల్లో రాయితీ వచ్చినట్లు అయితే రాష్ట్రానికి అనేక మిగులు బడ్జెట్ ఏర్పడే అవకాశం ఉంటుంది అని , ఆ దిశగా నేతలు అడుగులు వేయడం చాలా మంచిది అని ప్రజలు భావిస్తున్నారు. మరి పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ నేతలు ప్రత్యేక హోదా , స్పెషల్ ప్యాకేజీలతో పాటు అనేక పన్ను రాయితీలపై కూడా మాట్లాడాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: