పార్లమెంట్ ఫైట్: విశాఖ ఉక్కు చిక్కు ఊడుతుందంటారా?

Purushottham Vinay

• ఆంధ్రా ఎంపీలు విశాఖ ఉక్కుని కాపాడతారా? 

• విశాఖ ఉక్కు వీరుల ఆశలు చిగురించేలా ఏపీ ఎంపీలు ఫైట్ చేస్తారా? 


విశాఖ - ఇండియా హెరాల్డ్ : మూడేళ్ల క్రితం పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం తీసుకోవడం ఆంధ్రుల అందరినీ ఎంతగానో ఆందోళనకు గురి చేసింది. విశాఖ ఉక్కు ఉద్యోగులు అప్పటి నుంచీ ఇప్పటి దాకా వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్నారు. గత మూడేళ్ల నుంచి కూడా నిర్వహణా నిధులు లేక కేవలం 60 శాతం ఉత్పత్తి మాత్రమే విశాఖ ఉక్కు నుంచి వస్తోంది. తగినంత వర్కింగ్ క్యాపిటల్ లేక రూ. 20 వేల కోట్ల విలువైన మెషినరీ నిరుపయోగంగా మిగిలి ఉంది. 2022 నుంచి ఒక బ్లాస్ట్ఫర్నేస్-3 ఆపేయడంతో రెండున్నర మిలియన్ టన్నుల ఉత్పత్తి అర్ధాంతరంగా నిలిచిపోయింది. వైజాగ్ స్టీల్స్‎కే చెందిన రాయబరేలి ఫోర్జ్ వీల్ ప్లాంటును రూ.2వేల కోట్లకు అమ్మినా కూడా అవి అసలు ఎందుకూ కూడా ఉపయోగపడలేదు. విశాఖలో ప్లాంట్‎కు ఉన్న విలువైన 25 ఎకరాల స్థలాలను ప్లాట్లుగా వేసి అమ్మకానికి పెట్టడం జరిగింది. వీటిపై కోర్టులో స్టే కూడా ఉంది. 


కానీ చెన్నై ఇంకా హైదరాబాద్‎ని స్టీల్ స్టాక్ పాయింట్లతో పాటు, వివిధ నగరాల్లోని కార్యాలయ భవనాలను 500 కోట్లకు అమ్మేందుకు ప్రతిపాదించడం జరిగింది. ఇంకా ఈ దశలో మోడీ 3.0 ప్రభుత్వం తాజా రాజకీయ పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో ఆంధ్రులు ఆశగా ఉన్నారు. ఆంధ్రా ఎంపీలు పార్లమెంటులో ఫైట్ చేసి విశాఖ ఉక్కు ప్రైవేటికరణ చిక్కు ఊడదీయాలనీ కోరుకుంటున్నారు. మన ఎంపీలు అయిన సిఎం రమేష్, శ్రీ భరత్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని పార్లమెంటులో ఈ విషయం పై గట్టిగా ఫైట్ చెయ్యాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే వీరందరూ తలచుకుంటే ఖచ్చితంగా ఈ పని సుసాధ్యం అవుతుంది. అలా అవ్వాలంటే వీళ్ళు ఖచ్చితంగా కేంద్రంతో ఫైట్ చేసి తీరాలి. మరి వీళ్ళు విశాఖ ఉక్కు కోసం ఎంతవరకు ఫైట్ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: