ఏపీ: అమరావతి రైతుల కోసం తెగించిన అయ్యన్న...?

FARMANULLA SHAIK
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు, పార్టీకి అత్యంత విశ్వస పాత్రుడు ఆయనే చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఎన్టీఆర్, చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన ఆయన ..సొంతం ఎన్నో ఆటుపోట్లు తలెత్తిన పార్టీనే అంటిపెట్టుకొని ఉన్న నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు.ఆయన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి 24,676 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఆయన ఏడోసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు.అయ్యన్నాపాత్రుడు 1982లో పార్టీ ఆవిర్భావ సమయం నుంచి తెలుగు దేశం పార్టీలో ఉన్నారు. అయ్యన్నపాత్రుడు 1983, 1985, 1994, 1999, 2004, 2014, 2024ల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలాగే 1996లో అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచారు. ఆయన ఎన్టీఆర్‌, చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచే శారు. ఈసారి కూడా చంద్రబాబు కేబినెట్‌లో స్థానం దక్కుతుందని భావించారు.. కానీ యువతకు ప్రాధాన్యం ఇవ్వడంతో సీనియర్లకు అవకాశం దక్కలేదు.ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆయన సీనియార్టీని గుర్తించి స్పీకర్ బాధ్యతలు అప్పగించారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రెండో నెంబర్‌ గేటును గత ప్రభుత్వం వాస్తు పేరుతో మూసేసి దాని స్థానంలో గోడను కట్టింది. అది అప్పట్లో ఒక సంచలనాన్ని సృష్టించింది.ప్రస్తుతం ఏపీలో అధికారం మారిన తర్వాత గత ప్రభుత్వం చేసిన వికృత చేష్ట పనులకు ఫుల్స్టాప్ పెట్టుకొని పాలనలో దూసుకుపోతుంది కూటమి ప్రభుత్వం.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రెండో నెంబర్‌ గేటును స్పీకర్ అయ్యన్నపాత్రుడు తిరిగి ఓపెన్‌ చేయించారు. రైతుల కష్టాలు వినపడకూడదని ఒక నియంత కట్టుకున్న అడ్డుగోడను తొలగించామని ఆయన అన్నారు. గేట్-2 నుంచి ఎవ్వరూ రాకుండా కట్టిన గోడని బుధవారం జేసీబీతో తొలగించి, గేటుని తెరిపించామన్నారు.దాంతో ప్రస్తుతం అక్కడ రాకపోకలకు అనువుగా మార్గాన్ని సిద్ధం చేశారు.అమరావతి రైతులు తమకి జరిగిన అన్యాయానికి ప్రజాసౌమ్య పద్ధతిలో నిరసనలు, ఆందోళనలు చేస్తున్న సమయంలో గేటు-2 ని మూసేశారని వెల్లడించారు. ప్రజల తమ సమస్యలు చెప్పుకొనే అవకాశం కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత అంటూ ఆయన పేర్కొన్నారు. ప్రజాసౌమ్య వ్యవస్థలో ప్రజాసౌమ్య నిలయమైన శాసనసభ గేట్లు తెరిచే ఉండాలన్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్నది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజలకి అందుబాటులో ఉండే ప్రభుత్వం, ఇది ప్రజా అసెంబ్లీ అని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: