సామాన్యురాలిలా కనిపించడానికి ప్రాధాన్యత ఇచ్చే సునీత.. మాటలు మాత్రం తూటాల్లా పేలుతాయిగా!
ఆమె మాట్లాడే మాటలు తూటాల్లా పేలుతాయని రాజకీయాల్లో చాలామంది భావిస్తారు. అపోలో హాస్పిటల్స్ డాక్టర్ అయిన సునీత ఈ ఏడాది మే నెలలో ఐ.డీ.ఎస్.ఏ. ఫెలోగా కూడా ఎంపికయ్యారు. అంటువ్యాధుల రంగంలో సునీత చేసిన విశేషమైన కృషికి ఆమెకు ఈ గుర్తింపు దక్కింది. వైఎస్ సునీత కెరీర్ పరంగా అంచెలంచెలుగా ఎదుగుతూ తన ప్రతిభతో కెరీర్ పరంగా సక్సెస్ అయ్యారు.
రాజకీయాల్లో రాణించే అవకాశం ఉన్నా డాక్టర్ గా వైద్య సేవలు అందించడానికి ఆమె ప్రాధాన్యత ఇవ్వడం కొసమెరుపు. వైఎస్ సునీత అవినాష్ రెడ్డి, జగన్ టార్గెట్ గా పలు సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయడం జరిగింది. వైఎస్ సునీత విమర్శలు చేస్తే ఆమె ప్రశ్నలకు జవాబులు ఇవ్వడానికి వైసీపీ నేతలు సైతం ఒకింత టెన్షన్ పడతారనే సంగతి తెలిసిందే.
వైఎస్ సునీత తనకు ఎన్ని ఇబ్బందులు, అడ్డంకులు ఎదురైనా వివేకా హత్య కేసు విషయంలో వేగంగా పరిష్కారం దొరకడానికి తన వంతు కష్టపడ్డారు. రాబోయే రోజుల్లో అయినా వివేకా హత్య కేసుకు సంబంధించి వాస్తవాలు వెలుగులోకి వస్తాయేమో చూడాల్సి ఉంది. ఏపీలో వైసీపీ దారుణ పరాజయానికి సునీత కూడా ఒక విధంగా కారణమని వైసీపీ అభిమానులు భావిస్తున్నారు. భవిష్యత్తులో కూడా సునీత వైసీపీని టార్గెట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే వైఎస్ సునీత సక్సెస్ కావడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.