మంత్రి పదవికి పవన్ కళ్యాణ్ రాజీనామా..షాక్ లో కూటమి ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి మనకు గుర్తుండే ఉంటుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 100కు 100% స్ట్రైక్ రేట్ సంపాదించిన జనసేన పార్టీ... ఇరవై ఒక్క ఎమ్మెల్యేలను గెలుచుకుంది. అలాగే రెండు ఎంపీలను సొంతం చేసుకుంది. పోటీ చేసిన ప్రతి చోటా గెలిచి 100% స్ట్రైక్ రేట్ సంపాదించింది. దీంతో ప్రస్తుతం... ఏపీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తుంది జనసేన పార్టీ.

అయితే... అదే సమయంలో... చంద్రబాబు ప్రభుత్వంలో కీలక మంత్రి పదవులను కూడా తీసుకుంది. ఇక లేటెస్ట్ గా జనసేన పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను అలాగే ప్రత్యేకంగా గౌరవించింది జనసేన పార్టీ. ఈ సందర్భంగా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ విజయం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు.
 

మొన్న అంబానీ కుటుంబంలో కూడా... జరిగిన పెళ్లి సందర్భంగా జనసేన విజయం గురించి చాలామంది చర్చించారని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా... జనసేన పార్టీ కోసం కష్టపడ్డ వారందరికీ పదవులు ఇస్తామని... పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అలాగే... తన దగ్గర ఉన్న ఐదు శాఖల గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు పవన్. తన దగ్గర ఉన్న ఐదు మంత్రి పదవులను ఉంచుకోనని... త్వరలోనే రాజీనామా చేస్తానని పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు.
 

తన దగ్గర ఉన్న మంత్రి పదవులను వేరే వారికి అప్పగిస్తామని... దానిపై చంద్రబాబుతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తాను డిప్యూటీ ముఖ్యమంత్రిగా అలాగే మరో కీలక శాఖను తీసుకుంటానని వెల్లడించారు. అయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పడంతో జనసేన కార్యకర్తలు అలాగే నేతలు షాక్ అవుతున్నారు. ఐదు శాఖలు పవన్ కళ్యాణ్ దగ్గరే ఉంచుకోవాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: