ఏపీ: ముప్పు తిప్పలు పెడుతున్న మైనర్లు.. ఇంకా లభించని బాలిక ఆచూకీ..!

Divya
నంద్యాల జిల్లా ముచ్చు మర్రి లో గత కొద్ది రోజుల నుంచి వెతుకుతున్న  మూడేళ్ల బాలిక మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. ఈ మైనర్ బాలిక మృతదేహం పోలీసులకు ఒక సవాలుగా మారింది.. బాలిక మృతదేహం ఇంకా లభ్యం కాకపోవడంతో పోలీసులు సైతం ఆ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలలో ఎక్కువగా గాలిస్తూ ఉన్నారు.. మూడేళ్ల చిన్నారి పైన ఏడేళ్ల మైనర్లు అత్యాచారం చేసి చిన్నారిని చంపేసినట్లుగా పోలీసులు గుర్తించారు. గత వారం రోజుల నుంచి ఆ మైనర్లు చెప్పిన మేరకు అన్నిచోట్ల వెతుకుతున్న ఇంకా అమ్మాయి మృతి దేహం మాత్రం లభించలేదు.

ఈ మైనర్లు చేసిన అత్యాచారాన్ని సైతం ఖండిస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పట్టణంలో విద్యార్థి నాయకులు కూడా ధర్నాకి దిగడం జరిగింది.ముఖ్యంగా నిందితులను సైతం కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ అనిత కూడా ఈ విషయం పైన స్పందిస్తూ బాధితులను కఠినంగా శిక్షిస్తామని బాదిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించామని తెలిపింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు స్పెషల్ కోర్టును కూడా ఏర్పాటు చేస్తామని హోం మినిస్టర్ అనిత తెలియజేసింది.

ఈనెల ఏడవ తేదీన పార్కులో ఆడుకుంటున్న మూడేళ్ల బాలికను ముగ్గురు మైనర్లు ఎత్తుకెళ్లి మరి అత్యాచారం చేశారు. అనంతరం ఆ బాలికను చంపేసి మృతదేహం దొరకకుండా చేసినట్లు తెలియజేశారు. అలాగే ఎవరికి ఎలాంటి అనుమానాలు రాకుండా నిమ్మకాయలు పడివేసి క్షుద్ర పూజలు చేసినట్లుగా ఒక సీన్ ని కూడా క్రియేట్ చేశారట. కానీ ఈ ఘటన జరిగి వారం దాటిన ఇప్పటికీ ఆ బాలిక యొక్క మృతదేహం లభించలేదు. అయితే ఈ కేసులో అరెస్టు అయిన ఆ మైనర్లు సైతం పొంతన లేని సమాధానాలు తెలియజేస్తున్నారని బాలికను ఎక్కడ చంపి పడేశారనే విషయానికి రోజుకొక ప్లేస్ చెబుతూ తిప్పలు పెడుతున్నారని తెలుపుతున్నారు. కానీ ఇప్పటివరకు ఎన్డి ఆర్ఎఫ్  బృందాలకు కూడా ఎలాంటి క్లూ దొరకలేదని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: