విదేశాలకు పారిపోయిన నేతలు...బెంగ పెట్టుకున్న వైసీపీ ?

Veldandi Saikiran

బాపట్ల జిల్లాలోని అద్దంకి, పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గాలను ఎన్నికలకు ముందు చిన్ని హనిమిరెడ్డి , బాలాజీలను ఇన్చార్జీలుగా  నియమించింది వైసీపీ అధిష్టానం. అద్దంకి ఇన్చార్జిగా హనిమిరెడ్డిని ఎన్నికలకు నాలుగు నెలల ముందు ప్రకటించగా... పర్చూరుకు ఎడం బాలాజీని మాత్రం చివరికి నిమిషంలో ప్రకటించారు. ఎప్పుడు ప్రకటించినా చివరికి ఇద్దరికీ ఓటమి మాత్రం తప్పలేదు. ఈ రెండు సెగ్మెంట్స్ లో ప్రధానంగా ఉండి ఫలితాలను డిసైడ్ చేయగలిగే కమ్మ సామాజిక వర్గం మీద పైచేయి సాధించి గట్టి దెబ్బ కొట్టాలన్న వ్యూహంతో వైసిపి రెడ్డి కాపు వస్త్రాలను ప్రయోగించింది. కానీ చివరికి ఆ రెండు చోట్ల ప్రయోగాలు తుస్సుమన్నాయి.

అద్దంకి కోసం పేదకూరపాడు నియోజకవర్గానికి చెందిన చిన్న హనిమిరెడ్డిని రంగంలోకి దింపినా... విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లినా అవేమీ వర్కౌట్ కాలేదు. అద్దంకిలో బలమైన కమ్మ సామాజిక వర్గాన్ని ఎదుర్కొనేందుకు రివర్స్ సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా.... రెడ్డి నేతను ఇంపోర్ట్ చేసి మరి బరిలోకి దింపినా అసలు ఆ ప్రయత్నమే రివర్స్ కొట్టిందన్నది లోకల్ టాక్. హనీమిరెడ్డి ఆరంభంలో కాస్త పరవాలేదని పించిన ఆ తర్వాత టిడిపి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ముందు తేలిపోయారు. గొట్టిపాటికి స్థానికంగా ఉన్న పట్టు, మాస్ ఇమేజ్, సామాజిక సమీకరణ లాంటి అంశాలు కలిసొచ్చాయి.

వరుసగా నాలుగోసారి కూడా గొట్టిపాటికే జై కొట్టారు అద్దంకి ఓటర్. 2009 నుంచి అద్దంకిలో గొట్టిపాటి రవి కుమార్ హవ నడుస్తోంది. వరుస విజయాలతో పునాదుల్ని పటిష్టం చేసుకోవడంతో పాటు ఈసారి కేబినెట్ బెర్త్ కూడా దక్కించుకున్నారు ఆయన. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసిపి ఇన్చార్జ్ హనీమిరెడ్డి మాత్రం నియోజకవర్గంలో కనిపించడం లేదట. ఒకటి రెండు సార్లు ఏదో వచ్చానంటే వచ్చాను అన్నట్టుగా మెరుపు తీగలాగా అలా కనిపించి ఇలా వెళ్ళిపోయారట. అసలు ఆయన వచ్చి వెళ్లిన సంగతి చాలా మంది వైసీపీ కార్యకర్తలకు తెలియదన్నది లోకల్ టాక్. ఈ మొక్కుబడి టూర్స్, మమా అనిపించే ప్రోగ్రామ్స్ తో అద్దంకి వైసిపి కేడర్ లో కొత్త అనుమానాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల కోసం పక్క జిల్లా నుంచి వచ్చిన ఈ ఇంపోర్టెడ్ లీడర్ ఇక్కడ ఇన్చార్జిగా కొనసాగుతారా లేక అద్దంకిలో అయ్యేది లేదు పోయేది లేదు అనుకుంటూ తన దారి తాను చూసుకుంటారా అని వాళ్ళలో వాళ్లే చర్చించుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక పరుచూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఎడం బాలాజీది కూడా దాదాపు ఇదే స్టోరీ అట. చీరాలకు చెందిన ఎడం బాలాజీని ఎన్నికలకు ముందు వైసీపీ అధిష్టానం పర్చూరు నియోజకవర్గానికి పంపింది. 2019 ఎన్నికలకు ముందు చీరాల వైసిపి ఇన్చార్జిగా ఉన్న బాలాజీ అప్పట్లో ఆమంచి వైసిపిలో చేరికతో పార్టీని వీడి సైకిల్ ఎక్కారు. ఆ తర్వాత ఎవరికీ కనిపించలేదు. ఆ తర్వాత తన వ్యాపారాలను చూసుకుంటూ అమెరికాలో అక్కడే ఉండిపోయారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: