నారా లోకేష్: ఏపీలో కొత్త డైనమిక్ హీరో...రికార్డుల రారాజు ?

Veldandi Saikiran

* చంద్రబాబు కొడుకుగా గుర్తింపు
* ఉన్నత చదువులు, ఐటి మంత్రిగా
   అనుభవం
* తొలిసారి ఎమ్యెల్యేగా గెలుపు
* యూత్ ను ఆకట్టుకునే పనితీరు  

*ఏపీలో కొత్త డైనమిక్ హీరో...రికార్డుల రారాజు
 
రెండు తెలుగు రాష్ట్రాలలో... యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అనగానే నారా లోకేష్ పేరు వినిపిస్తుంది. ఎంతోమంది యంగ్ లీడర్స్ ఉన్నప్పటికీ నారా లోకేష్ కు ఉన్న ప్రత్యేకత అంతా కాదు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు తనయుడిగా... బాలయ్య అల్లుడుగా, ఐటీ శాఖ మంత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు నారా లోకేష్.

వార్డు మెంబర్గా కూడా గెలవలేరని... విమర్శించిన వారి చేత శభాష్ అనిపించుకున్నారు నారా లోకేష్. మొన్న మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు 90 వేల మెజారిటీతో  ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు నారా లోకేష్. అయితే అలాంటి నారా లోకేష్... గతంలో చాలా బొద్దుగా ఉండేవారు. ఆయన తెలుగు కూడా సరిగా మాట్లాడలేకపోయేవారు. కానీ పరిస్థితులు మారినాకొద్దీ.. రాజకీయాలలో ఓనమాలు నేర్చుకున్నారు.

తెలుగు స్పష్టంగా మాట్లాడడమే కాకుండా... స్లిమ్ గా నారా లోకేష్ తయారయ్యారు. ఇక నారా లోకేష్ ఇప్పుడు.. ప్రజల్లోకి వెళితే వైట్ షర్ట్ అండ్ బ్లాక్ పాయింట్ వేస్తారు. తన వైట్ షర్ట్ కు కచ్చితంగా.. సైకిల్ గుర్తు ఉంటుంది. మరి కొన్నిసార్లు ఎల్లో కలర్... తన పార్టీని గుర్తు చేసేలా.. షర్టు వేసుకుంటారు.

అయితే... ఇప్పటికీ తెలుగులో స్పష్టంగా మాట్లాడడానికి నారా లోకేష్ కష్టపడతారు అన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ గతంలో కంటే నారా లోకేష్ ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నారు. ఇక నారా లోకేష్ స్టైల్ విషయానికి వస్తే... ముఖ్యమంత్రి కొడుకు అయినప్పటికీ నార్మల్గానే కనిపిస్తారు. ఖరీదైన బట్టలు, షూస్ ధరించినట్లు దాఖలాలు ఎక్కడ కనిపించలేదు. అందరికీ అందుబాటులో.. ఉంటూ సింపుల్ గా జీవితాన్ని గడుపు తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: