కౌ బాయ్ లుక్ లో గులాబీ బాస్.. ఆయన స్టైలే వేరప్పా ?

Veldandi Saikiran
* కామన్ మాన్ లాగే కేసీఆర్
* 10 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్
* తెలంగాణ రాష్ట్ర సాధకుడు
* తెలంగాణ ఉద్యమకారుడు

 తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు... పేరు వినగానే.. తెలంగాణ ఉద్యమమే అందరికీ గుర్తుకువస్తుంది. బక్క పల్చటి.. కల్వకుంట్ల చంద్రశేఖర రావు... తన రాజకీయ చరిత్రలో ఎన్నో  ఘట్టాలు ఎదుర్కొన్నారు.  ఉద్యమ కాలంలో జైలు జీవితాలు గడిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్... తెలంగాణ గాంధీగా మారారు.
 కెసిఆర్ తెలంగాణ కోసం పోరాటం చేసిన పటిమను గుర్తించిన.. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆయనకు పది సంవత్సరాలపాటు  అధికారం ఇచ్చారు. అంటే తెలంగాణ కోసం కెసిఆర్ ఎంత మేరకు కష్టపడ్డారో..  ప్రజల తీర్పే స్పష్టం చేస్తోంది. అయితే అలాంటి కల్వకుంట చంద్ర శేఖర రావు.. సాధారణ రైతు జీవితాన్ని గడుపుతారు.  నిత్యం... తెల్లటి దుస్తులు వేసి.. ప్రజల మధ్య తిరుగుతూఉంటారు.
 ఇక ఏవైనా సంక్షేమ పథకాలు, ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు కౌబాయ్ క్యాప్ పెట్టి మెరుస్తారు. అలాగే... సదాసీదా రైతు వాడే చెప్పులనే ఆయన వాడుతారు. పెద్దగా లగ్జరీ లైఫ్ అస్సలు కోరుకోరు కేసీఆర్. సమయం దొరికినప్పుడు ప్రజల వద్దకు... కాస్త ప్రశాంతత కోసం ఫామ్ హౌస్ కి వెళ్లి వ్యవసాయం చేసుకుంటారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు.
అలాగే కెసిఆర్ కు కాస్త మందు అలవాటు ఉందని... ఆయన స్నేహితులు ఇప్పటికీ చెబుతూ ఉంటారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పేపర్లు వస్తాయో అన్ని న్యూస్ పేపర్లు చదివి... పడుకుంటారట కేసీఆర్. అలాగే.. ఆరడుగుల బుల్లెట్ లాగా ఉన్న కల్వకుంట చంద్రశేఖర రావు ... చాలా సన్నగా.. సింపుల్ గా ఉంటారు. సన్నగా ఉన్నా సరే... ఇండియాలోనే చరిత్ర సృష్టించిన ముఖ్యమంత్రిగా కల్వకుంట చంద్రశేఖర రావు ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుండి పోతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: