రాజకీయ ఆహార్యంలో ఎన్టీఆర్ ని తలదన్నే నాయకుడే లేరుగా..!!

murali krishna

* తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్
* శ్రామిక వర్గానికి ప్రతీకగా ఖాకి బట్టలతోనే రాజకీయ ప్రచారం    
* రాజకీయ ఆహార్యంలో నూతన ట్రెండ్ సృష్టించిన ఎన్టీఆర్

విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆయన అద్భుతమైన నటనకు అభిమాని కానివారంటూ ఎవరుండరు.అంతలా ఆయన నటనాశైలి అందరిని రంజింపజేసింది.తెలుగు జాతిపై ఆయనకు వున్న మక్కువ తిరుగులేని నాయకుడిని చేసింది.సినీ రంగం నుంచి రాజకీయాలలోకి వచ్చి రాష్ట్ర భవిష్యత్ నే మార్చి వేశారు.1989 మార్చి 29 న ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడడమే ద్యేయం గా ఆనాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు.సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అనే నినాదంతో ఎన్టీఆర్ రాజకీయ ప్రసంగాలు ప్రజలలో ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయి. శ్రామిక వర్గానికి ప్రతీకగా ఎన్టీఆర్ ఖాకి దుస్తులు ధరించి చైతన్య రథంపై ఎన్నికల ప్రచారం సాగించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ తన ఉద్వేగ భరితమైన ప్రసంగాలతో ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నారు.
సినీ రంగంలో తనకున్న విశేష ఆదరణ తో అఖండ ప్రజాభిమానాన్ని పొంది 1983 లో జరిగిన సాధారణ ఎన్నికలలో ఎన్టీఆర్ అఖండ విజయం సాధించారు.పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారం సాధించి రికార్డు సృష్టించారు.ఆంధ్రప్రదేశ్ లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తొలి నాయకుడిగా ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు.సినిమావాళ్ళకి రాజకీయాలు ఏమి తెలుసు అనేవారికి ఎన్టీఆర్ చారిత్రాత్మక విజయం చెంప పెట్టుగా నిలిచింది.ఎన్టీఆర్ అఖండ విజయంలో ఆయన ఆహార్యం కూడా కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు.ఎన్నికల ప్రచారంలో ఖాకి బట్టలు ధరించి శ్రామిక వర్గానికి దగ్గరయ్యారు.ముఖ్య మంత్రి అయ్యాక ఎన్టీఆర్ ఎక్కువగా కాషాయ రంగు బట్టలు మాత్రమే ధరించేవారు.రాజకీయ ఆహార్యం లో ఎన్టీఆర్ ఓ ట్రెండ్ సృష్టించాడని చెప్పాలి.ఎన్నోఅభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలతో ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయి గా నిలిచిపోయారు.
   
 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: