ఏపీ: జనసేన నాయకులకు అధినేత షాక్..!

Divya
సొంత పార్టీ నాయకులకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా తనను బెదిరించే వారు ఎవరైనా సరే పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని.. అలా వెళ్ళిపోయిన తాను భయపడనంటూ కూడా డైరెక్ట్ గానే వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. జనసేన ప్రజాప్రతినిధులకు నిర్వహించిన సత్కార కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అందరిని ఆందోళన కలిగిస్తోంది. కూటమి విజయానికి మనం తీసుకున్న నిర్ణయాలే చాలా కీలకమని కూడా తెలిపారు.

ముఖ్యంగా తాను ఉపముఖ్యమంత్రి అవుతానని అనుకోలేదని చాలా గొప్ప విజయం సాధించినట్లుగా పవన్ వెల్లడించారు.. గత ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉండేది కాదన్నారు.. గతంలో ఏడు శాతం నుంచి 20 శాతం వరకు జనసేన పార్టీ ఓటింగ్ శాతం పెరిగింది అంటూ తెలిపారు. ఇదంతా కూడా జనసేన బలమే అంటూ తెలిపారు. వైసీపీ నేతలు మనకు ప్రత్యర్ధులే తప్ప శత్రువులు కాదని కూడా పవన్ కళ్యాణ్ తెలియజేశారు. వాళ్లు మిమ్మల్ని శత్రువులుగా భావించవచ్చు.. కానీ వైసీపీ నేతలు చేసిన తప్పుల్ని మనం చేయకూడదు అంటూ తెలియజేశారు.

వైసిపి నేతలు ఎవరైనా తప్పు చేసి ఉంటే.. వారిని చట్టపరంగానే శిక్షించాలి అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు. వైసిపి నేతలను కార్యకర్తలను వేధించడం లేదా సోషల్ మీడియాలో కించపరిచేలా చేయకూడదని కూడా తెలిపారు.మనం గెలిచామని అధికారులని ఇబ్బంది పెట్టేలా మాట్లాడకూడదని కుటుంబ సభ్యుల్ని ప్రభుత్వ కార్యాలయాలలో పాల్గొనకుండా చూడాలి అంటూ తెలియజేశారు. రౌడీయిజం చేయకూడదు అంటూ పార్టీ నాయకులకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్. సొంత పార్టీ నాయకులు ఎదిరించిన లేకపోతే సొంత పార్టీ నాయకుల్ని సోషల్ మీడియాలో హెచ్చరించే వాళ్లను కూడా వదులుకోవడానికి తాను సిద్ధంగానే ఉన్నానంటూ తెలిపారు. మహిళలను కించపరిచేలా తన సొంత పార్టీలో ఉంటే కుదరదు అని కూడా తెలిపారు. క్రమశిక్షణతో పాటు ప్రతి ఒక్కరు సమన్వయంగా నడుచుకోవాలి అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: