ఏపీలో మధ్యంతర ఎన్నికలు.. షాకింగ్ విషయం చెప్పిన విజయసాయి?

praveen
2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ జనసేన బిజెపి పార్టీల కూటమి అఖండ మెజారిటీని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అన్న విషయం తెలిసిందే. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే సమయంలో గతంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదాని కూడా దక్కించుకోలేక.. కేవలం 11 స్థానాలలో మాత్రమే విజయం సాధించగలిగింది. దీంతో రానున్న రోజుల్లో వైసీపీ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కూటమిలోని మూడు పార్టీలలో ఏదో ఒక దాంట్లోకి వెళ్లే అవకాశం ఉందని అందరూ అంచనా వేశారు.

 ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇదే విషయంపై చర్చ జరుగుతుంది. ఇలాంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన బిజెపి టిడిపి పార్టీలు ఏర్పాటు చేసిన సంకీర్ణ కూటమి కూలిపోతుంది అంటూ విజయ సాయి రెడ్డి చేసిన కామెంట్స్ సంచలనంగా మారిపోయాయ్. విశాఖపట్నంలో ఇటీవల ఏర్పాటు చేసిన ఒక హోటల్లో ఆయన విలేకరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఏకంగా త్వరలోనే ఏపీలో మభ్యంతర ఎన్నికలు వస్తాయి అంటూ సంకేతాలు ఇచ్చారు విజయసాయి రెడ్డి.

 ఢిల్లీ రాజకీయాలపై గట్టి పట్టు ఉన్న విజయసాయిరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారిపోయింది. అయితే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి సరైన మెజారిటీ లేక టిడిపి సహాయం తీసుకోవడం మరోవైపు వైసిపి అధినేత జగన్ సైతం వరుసగా బెంగళూరు వెళ్లి వస్తుండడం లాంటి పరిణామాలు మధ్యంతర ఎన్నికల వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి అని చెప్పాలి. రాష్ట్రంలో మభ్యంతర ఎన్నికలు వస్తే తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఐదేళ్ల తర్వాత ఎన్నికలు జరిగినా లేదంటే మత్యాంతర ఎన్నికల వచ్చినా.. తమ విజయాన్ని ఎవరు ఆపలేరు అంటూ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తను ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఎవరికీ భయపడే ప్రసక్తి లేదు అంటూ విజయ సాయి చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలలో సరికొత్త చర్చకు చెరలేపై అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: