ఉరేసుకుంటా అంటూ బాలినేని షాకింగ్ కామెంట్స్..??

Suma Kallamadi


వైసీపీ అధిష్టానం ప్రకాశం జిల్లా అధ్యక్షుడిని మారుస్తుందని కొద్దిరోజులుగా కార్లు షికారు చేస్తున్నాయి. అయితే తాజా బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి దీనిపై రియాక్ట్ అయ్యారు. బాలినేని శ్రీనివాస్‌ ఒంగోలు నియోజకవర్గానికి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైసీపీ పార్టీలో చాలా కీలకంగా పని చేశారు. అయితే
ప్రకాశం జిల్లా బాధ్యతలను చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి అప్పగిస్తారని ప్రచారం జరిగింది. ఐదుసార్లు ఎమ్మెల్యే అయిన తనను కాదని వేరే వారికి జిల్లా బాధ్యతలు అప్పగించనున్నారని తెలిసి పార్టీ మారేందుకు బాలినేని శ్రీనివాస్ సిద్ధం అయినట్లు న్యూస్ వచ్చాయి. ఈ వార్తలను బాలినేని ఖండించారు. తాను జనసేనలో చేరుతున్నానని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని కుండబద్దలు కొట్టారు. పార్టీ మారాల్సిన అవసరం నాకేంటి అని ప్రశ్నించారు.

ఒంగోలును విడిచిపెట్టే ప్రసక్తే లేదని, ఇక్కడే ఉంటానని కూడా స్పష్టం చేశారు. వేరే జిల్లా నేతను అధ్యక్షుడిగా నియమించాల్సిన అవసరమేంటి? ఈ జిల్లాలో సరైన నాయకులే లేరా? అని వైసీపీ పార్టీ అధినేత జగన్‌కు సూటిగా ప్రశ్నలు వేశారు. ప్రకాశం జిల్లాలో చాలామంది మంచి నాయకులు ఉన్నారని తెలిపారు. అధ్యక్ష పదవిని జిల్లాకు సంబంధించిన నేతలకే ఇస్తే బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

తనను హవాలా మంత్రిగా కూటమి నేతలు చిత్రీకరించడానికి చాలా ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి దుష్ప్రచారాలను మానుకోవాలని బాలినేని సీతమ్మ పరిచారు. తనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై ఎవరైనా విచారణ జరిపించుకోవచ్చు అని అన్నారు. కావాలంటే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించవచ్చని కూడా అన్నారు. ఒకవేళ వీరి విచారణలో అవినీతి చేసినట్లు తేలితే తాను ఉరేసుకుంటానని షాకింగ్ కామెంట్లు చేశారు. మొత్తం మీద తాజా ప్రెస్ మీట్ లో జగన్ నిర్ణయం పై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా తానుము అవినీతి చేయలేదని ఒక మెసేజ్ అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: