మెగా బ్రదర్స్‌ కు పవన్ దిమ్మతిరిగే షాక్‌..వాళ్లకు ఒక్క పదవి ఇవ్వను ?

Veldandi Saikiran
నామినేటెడ్ పోస్టుల విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. కష్టపడిన వారిని మరిచిపోబోమని... హరిప్రసాద్ కు గుర్తింపు లభించినట్టే అందరికీ గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌. నామినేటెడ్ పోస్టులు ఉంటాయి.. కానీ ప్రతి ఒక్కరూ ఛైర్మన్ పదవులు ఆశిస్తే కష్టమని... కొందరు టీటీడీ ఛైర్మన్ సహా ఇంకొన్ని ఛైర్మన్ల పదవులు అడగుతున్నారని వెల్లడించారు. ఒక్క టీటీడీ ఛైర్మన్ పదవి కోసమే 50 మంది అడిగారు.. కానీ ఆ పదవి ఒక్కరికే ఇవ్వగలరని పేర్కొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.

నా కుటుంబ సభ్యులెవరు టీటీడీ ఛైర్మన్ పదవి అడగలేదని... కానీ నా కుటుంబ సభ్యులు టీటీడీ ఛైర్మన్ పదవి అడిగారని ప్రచారంలో పెట్టారు.. అది కరెక్ట్ కాదన్నారు.మొన్నటి వరకు నాగబాబుకు టీటీడీ పదవి వస్తుందని ప్రచారం జరిగిన తరుణంలో.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..క్లారిటీ ఇచ్చారు. అలాగే, ఈ పదవుల కోసం చంద్రబాబుని ఎలా అడగాలో తెలియడం లేదు....మీకిది చేశాం కాబట్టి.. మాకు ఈ పదవి ఇవ్వండి అని అడగలేమని తెలిపారు.

అందరికీ న్యాయం చేసేలా నా వంతు ప్రయత్నం చేస్తానని... కానీ ఎవరికైనా పదవి ఇవ్వలేకుంటే పెద్ద మనస్సుతో ఆలోచించండని కోరారు. ప్రధానిని నేనూ కెబినెట్ పదవి అడగగలను.. కానీ నేను అడగలేదన్నారు. పదవుల కోసం మనం పని చేయడం లేదని... ఎవరైనా ఏమైనా పదవి కావాలంటే అడగండి.. కమిటీలో చర్చించి పదవులిచ్చే ప్రయత్నం చేస్తామని ప్రకటించారు.  పదవులు అడిగే వాళ్లు.. వాళ్ల అనుభవాలను.. వారి అర్హతలకు దగ్గరగా ఉండే పదవులు అడగండన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో అందరూ ఆలోచన చేయాలని కోరారు.

నంద్యాల ఘటనల్లాంటివి జరగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని... మనోహర్ సివిల్ సప్లైస్ శాఖను సమర్ధవంతంగా పని చేస్తున్నారని తెలిపారు. అక్రమంగా రేషన్ బియ్యం కట్టడికి నాదెండ్ల చర్యలు తీసుకుంటున్నారన్నారు. కెబినెట్టులో రేషన్ అక్రమాలు సహా.. రాష్ట్రాభివృద్ధి కోసం కెబినెట్టులో చర్చిస్తామని ప్రకటించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: