పవన్‌ వార్నింగ్‌: కూటమికి జనసేనే వెన్నెముక..ఇది మరవద్దు..?

Veldandi Saikiran
కూటమికి జనసేనే వెన్నెముక..ఇది మరవద్దు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. జనసేన పార్టీ తరపున గెలిచిన ప్రజా ప్రతినిధులను సత్కరించిన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన పోటీ చేసిన ప్రతి సీటును గెలిచిందని... ముంబైలో ఓ పెళ్లికి వెళ్తే.. అందరూ ఇదే విషయాన్ని అడిగారని కొనియాడారు. జనసేన 100 శాతం స్ట్రయిక్ రేట్ అనేది దేశంలో ఓ కేస్ స్టడీ అయిందని... జనసేన విజయం గొప్ప విజయం అన్నారు.
జనసేన తిన్నన్ని దెబ్బలు మరెవరికైనా తగిలి ఉంటే వేరే వాళ్లు తట్టుకోలేకపోయేవారని... ఓటమి తర్వాత మాజీ సీఎం సభలో ఉండలేక వెళ్లిపోయారన్నారు. ఒక్క స్థానం లేకున్నా.. పట్టుదలతో పని చేశామని చెప్పారు పవన్‌ కళ్యాణ్‌. 175లో 21 పెద్ద సంఖ్య కాకపోవచ్చు.. కానీ 164 రావడానికి జవసేన వెన్నెముకగా మారిందన్నారు. గతంలో రోడ్డు మీదకు రావాలంటే భయ పడే పరిస్థితి ఉందని... వైసీపీ నేతలు పచ్చి బూతులు తిట్టేవారన్నారు.
గతంలో సాక్షాత్తూ ఓ ఎంపీనే సీఐడీ కార్యాలయంలో కొట్టారని... అడ్డగోలు దోపిడీ గత ప్రభుత్వం హయాంలో జరిగిందని తెలిపారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అందరికీ ధైర్యం ఇచ్చామని... జనసేన పోటీ చేయని చోట్ల కూడా జనసేన మిత్రపక్ష అభ్యర్థులకు అండగా నిలిచారని తెలిపారు. జనసేన రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే పని చేశారు.... పొట్టి శ్రీరాములు, డొక్కా సీతమ్మ ప్రేరణతో పని చేస్తున్నామని పేర్కొన్నారు.
పదవులతో సంబంధం లేకుండా ప్రజల కోసం పని చేస్తున్నామని... ప్రస్తుతం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నామన్నారు. కీలక శాఖలు తీసుకున్నామని.. సరైన సమయంలో అందరికీ బాధ్యతలు అప్పగిస్తానని వెల్లడించారు. 140 కోట్ల ప్రజల భారాన్ని మోసే ప్రధానికి సాయంగా నిలవాలని... పోటీ చేయని నేతలూ పార్టీ కోసం పని చేశారని తెలిపారు  పవన్ కళ్యాణ్.  ఎంత సాధించినా ఒదిగి ఉండడం మంచిది.... ఎన్ని స్ఖానాలు మనకున్నాయని కాదు.. ఎంత బలంగా చేశామనేది ముఖ్యమన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: