బాబుకు బిగ్ సవాళ్లు : హామీ అయితే ఇచ్చారు.. కానీ మోడీని ఒప్పించగలరా?

praveen
గతంలో అసెంబ్లీ సమావేశాల సమయంలో తనకు అవమానం జరిగిందని.. తాను ముఖ్యమంత్రి అయ్యేంతవరకు అసెంబ్లీలో అడుగుపెట్టను అని శబదం చేసిన చంద్రబాబు.. 2024 ఎన్నికల్లో ఆ శబతాన్ని నిజం చేసుకున్నారు. జనసేన, బిజెపి పార్టీలతో ఎన్నికల బరిలోకి అఖండ విజయాన్ని సాధించారు. ఇక నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇక ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కూడా కీలకంగా కొనసాగుతున్నారు చంద్రబాబు. ఇప్పటికే నెలరోజుల పాలన పూర్తయింది. దీంతో ఇక ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ముందు ఉన్న సవాళ్లు ఏంటి.. ఆ సవాళ్లను చంద్రబాబు ఎలా అధిగమించబోతున్నారు అనే విషయంపై రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

 కాగా ప్రస్తుతం చంద్రబాబు ముందు ఉన్న అతిపెద్ద సవాళ్లు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్నింటిని కూడా నెరవేర్చడం. అయితే గతంలో వైసిపి ప్రభుత్వం ఇచ్చిన పథకాల ద్వారా.. ఇక భారీగా అప్పులు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారు అంటూ చంద్రబాబు విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఎక్కువ మొత్తంలోనే పథకాల ద్వారా ప్రజలకు పంచేందుకు సిద్ధమయ్యారు చంద్రబాబు. దీంతో దీనికోసం అటు ఎక్కడి నుంచి అప్పులు తీసుకువస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

 అమ్మకు వందనం, రుణమాఫీ, ప్రతి మహిళకు నెలకు 1500, మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటే భారీగా అప్పులు తీసుకోవాల్సిందే. అయితే గతంలో జగన్ అప్పులు తీసుకున్నాడు అంటూ విమర్శించిన చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ అప్పులు తీసుకోకుండా జనాలపై టాక్స్ ల భారం మోపకుండా ఎలా పథకాలను అమలు చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఒకే ఒక్క దారి మాత్రమే ఉంది. అది మోదీ నుండి గ్రాంట్ లను పొందడం. అంటే అప్పులుగా కాకుండా గ్రాంట్లుగా పొందుతే మళ్ళీ చెల్లించాల్సిన అవసరం ఉండదు.

 ఇలా ప్రస్తుతం ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు మోదీని ఒప్పించి ఎంత మేరకు గ్రాంట్ లు తీసుకు రాగలుగుతారు అన్నది ప్రస్తుతం ఆయన ముందు ఉన్న పెద్ద సవాలు. అయితే ఒకవేళ మోడీ చంద్రబాబు డిమాండ్కు ఒప్పుకొని గ్రాంట్లు ఇస్తే ఇక అటు ఎన్డీఏ కూటమిలోనే మిగతా పార్టీలు కూడా ఇలాంటి గ్రాంట్లు అడిగే అవకాశం ఉంది. మరి ఈ విషయంలో మోది ఎలా వ్యవహరిస్తారు అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన అంశం.  చంద్రబాబు తన రాజకీయ అనుభవాన్ని మొత్తం ఉపయోగించి ఇలా మోదిని ఒప్పించగలరు అని అటు టిడిపి శ్రేణులు అనుకుంటున్నారట. ఏం జరగబోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: