ఏపీ: పార్టీ కోసం అలాంటి పని చేయబోతున్న పవన్..!

Divya
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ని బలోపేతం చేయడంలో చాలా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే సభ్యత నమోదు వివరాలు కూడా శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది పవన్ కళ్యాణ్. రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగా సభ్యత్వాన్ని చేర్పించాలనే విధంగా నాయకులకు కార్యకర్తలకు సైతం ఆదేశాలు జారీ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయం పైన పార్టీలో ఉండే ముఖ్య నేతలతో కూడా మాట్లాడినట్లు సమాచారం. జనసేన రాజకీయ వ్యవహారాల ఇన్చార్జిగా నాదెండ్ల మనోహర్ ముఖ్యనేతలతో కూడా టెలికాన్ఫరెన్స్ తో మాట్లాడినట్లు తెలుస్తోంది.

ప్రతి నియోజకవర్గంలో నుండి 50 మందికి లాగిన్ ఐడీలు ఇవ్వబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల జనసేన కేవలం 6 లక్షల 47 వేల మంది సభ్యులు మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈసారి సభ్యుల సంఖ్య 9 లక్షలకు పైగా పెంచాలని టార్గెట్ తో పవన్ కళ్యాణ్ పెట్టుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అంతేకాకుండా పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజలలో తమ పేరుని ఎక్కువగా వినిపించేలా చేయాలని ఆలోచనతో జనసేన పార్టీ ఆ వైపుగా అడుగులు వేస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాలలో సభ్యత నమోదును సైతం చేపట్టాలని పవన్ కళ్యాణ్ కూడా తమ నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. పది రోజులపాటు సభ్యత నమోదు కార్యక్రమాలు జరుగుతాయని ఇందుకోసం పార్టీ యంత్రాంగం మొత్తం కూడా కదలి రావాలి అంటూ పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.. పార్టీ పెట్టి ఇప్పటికి ఎన్నో ఏళ్ళు అయిన 2024 ఎన్నికలలో కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ తో పాటు తమ పార్టీ నేతలు నిలబడిన ప్రతిచోట కూడా భారీ ఘనవిజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా కూటమిలో భాగంగా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: