బాబు బిగ్ సవాళ్లు : ఆడబిడ్డలందరికి చంద్రబాబు న్యాయం చేయగలరా..?

FARMANULLA SHAIK
* ఇప్పటివరకు ఇలాంటి ఆర్ధిక సవాళ్లు ఎదుర్కొనని చంద్రబాబు
* సవాళ్ళను ఎదుర్కొని నిలబడగలరా?
* ఈ సవాళ్ళను ఎదుర్కోడానికి కేంద్రం పాత్ర ఎంతవరకు?

(అమరావతి-ఇండియా హెరాల్డ్ ) : ఏపీలో కూటమి ప్రభుత్వం భారీ విజయం సాధించిన తర్వాత ప్రజలకు వరుసపెట్టి శుభవార్తలు చెప్తూనే ఉంది. సూపర్ సిక్స్  హామీల ఎజెండాతో అధికారం చేపట్టిన తర్వాత దాని అమలు దిశగా అడుగులు వేస్తుంది. సీఎం చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగా డీయస్సీ,పెన్షన్ లాంటివి అమలు చేశారు.ఈ క్రమంలో తాజాగా మరో పథకాన్ని అమలు చేయబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కూటమి ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్దపీట వేయబోతున్నట్లు తెలుస్తోంది. సూపర్ సిక్స్ పథకం కింద కూటమి ఎన్నికల సమయంలో ఆరు హామీలు ఇచ్చింది. అందులో ఒక పథకమైన 'ఆడబిడ్డ నిధి' కింద 18-59 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. త్వరలోనే విధివిధానాలను సీఎం చంద్రబాబు ప్రకటించనున్నట్లు సమాచారం. ఐతే ఈ పథకాన్ని వచ్చేనెల నుంచి అమలు చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కాకపోతే ఇప్పటికే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేక సార్లు ఖజానా ఖాళీగా ఉందని గత ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసిందని ఆర్ధికంగా రాష్ట్రం బాగా కష్టాల్లో ఉందని అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని అనేక పర్యాయములు అంటున్న సంగతి తెల్సిందే. అయితే వారు అలా అంటున్నపుడల్ల సూపర్ సిక్స్ హామీలు అసలు అమలు చేసే ఆలోచన కూటమి ప్రభుత్వానికి ఉందా? లేదా? అని ప్రజలు భావిస్తున్నారు. చూస్తుంటే ప్రస్తుత రాష్ట్ర పరిస్థితిని బట్టి సూపర్ సిక్స్ హామీల అమలు సీఎం ముందున్న పెద్ద సవాలుగా మారిందని విశ్లేషకులు అంటున్నారు.ఇప్పటికే పెన్షన్ పెంపు వల్ల అదనపు భారం రాష్ట్రంపై పడింది.ఐతే ముందు ముందు రానున్న నిరుద్యోగభృతి,ఉచిత బస్సు,తల్లికి వందనం లాంటి పధకాలతో రాష్ట్ర ఆర్ధికపరిస్థితి ఇంకా దిగజారిపోతుందని ప్రస్తుతం ఈ పధకాల అమలు అనేది తలకు మించిన భారంలాగా ఉందని చంద్రబాబు తర్జన భర్జన అవుతున్నట్లు తెలుస్తుంది.అయితే ఎన్నికల్లో గెలవటమే లక్ష్యంగా పెట్టుకొని రాజకీయ పార్టీలు ఎవరికి వారే పోటాపోటీగా అమలు చేయలేని హామీలు చేసి గెలిచాక వాటి అమలు కస్టసాధ్యం అని తెలిసి దాని నుండి తప్పించుకోడానికి లేనిపోని కండిషన్స్ పెట్టి ఆర్ధిక భారం తగ్గించుకోడానికి ట్రై చేస్తున్నారు. దాని వల్ల లబ్ది పొందనివారు పార్టీపై వ్యతిరేక భావజాలంతో ఉంటున్నారు.అయితే ఇలాంటి కీలక పరిస్థితుల నుండి కేంద్ర ప్రభుత్వం కూటమికి ఎంతవరకు అండగా ఉంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: