బీజేపీ పతనం మొదలైందా...హిందూత్వం పని చేయడం లేదా?

Veldandi Saikiran
భారతదేశంలో భారతీయ జనతా పార్టీ.. గడిచిన 10 సంవత్సరాలలో... తిరుగులేని పార్టీగా ఎదిగింది. ప్రధాని నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా దర్శకత్వంలో నడిచిన బిజెపి పార్టీ... హిందుత్వాన్ని ఆయుధంగా వాడుకొని 10 సంవత్సరాల పాటు... తిరుగులేని శక్తిగా ఎదిగిందని చెప్పవచ్చు. అయితే మొన్న 2024 అసెంబ్లీ ఎన్నికలు అప్పటి నుంచి... భారతీయ జనతా పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.

సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక పోయిన.. బిజెపి... మిత్రపక్షాల సహాయాన్ని తీసుకుంది. అదే సమయంలో... అయోధ్యను ఎంతో ప్రతిష్టాత్మకంగా కట్టి... అక్కడ ఎంపీ సీట్ కోల్పోయింది. మీడియాను బెదిరిస్తున్న బిజెపి... కార్పొరేట్ సంస్థలను పెంచి పోషిస్తుంది. సోషల్ మీడియాని కూడా లైట్ తీసుకుంది బిజెపి.  హిందుత్వం పేరుతో రాజకీయాలు చేయడం ఓవర్ అయిపోయింది. దీనివల్ల... వరుసగా బిజెపి పతనం మొదలైంది.

మొన్న అయోధ్యలో ఓడిపోయిన బిజెపి పార్టీ... తాజాగా జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో... అత్యంత దారుణంగా ఓడిపోయింది. ఇండియా వ్యాప్తంగా ఏడు రాష్ట్రాలలో 13 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో 10 సీట్లలో ఇండియా కూటమి సత్తా చాటింది. అదే సమయంలో బిజెపి పార్టీ కేవలం రెండు చోట్లకే పరిమితం కావడం దారుణం. అందులోనూ మరో హిందూ క్షేత్రమైన... బద్రీనాథ్ లో ఓటమిపాలైంది.

ఉత్తరాంకట రాష్ట్రంలోని బద్రీనాథ్ లో... కాంగ్రెస్ చేతుల్లో బిజెపి అభ్యర్థి ఓడిపోయారు. అదే ఉత్తరాఖండ్లో మంగళౌరు ప్రాంతం లో కూడా బిజెపి ఓడిపోయింది. ఇలా వరుసగా హిందుత్వ ప్రభావం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలో కూడా బిజెపి పార్టీ ఓడి పోవడం... ఆ పార్టీ పతనానికి నాంది పలుకుతోంది. ఇకనైనా బిజెపి పార్టీ పెద్దలు మేలుకోకపోతే... గతంలో కాంగ్రెస్కు పట్టిన గతే పట్టుతుందని.. రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ప్రస్తుత పరిస్థితులపై బీజేపీ పార్టీ ఎలా స్పందించి.. ముందుకు వెళుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: