తప్పు మీద తప్పు చేస్తున్న షర్మిల.. ఈ ధోరణితో రాజకీయాల్లో సక్సెస్ కష్టమేనా?

Reddy P Rajasekhar
రాజకీయాలలో షర్మిల వెళ్తున్న రూట్ రైటా? రాంగా? అనే ప్రశ్నకు ఏ మాత్రం సందేహం అవసరం లేకుండా రాంగ్ అని చెప్పవచ్చు. తప్పు మీద తప్పు చేస్తున్న షర్మిలకు కనువిప్పు ఎప్పుడు కలుగుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వైఎస్సార్ ఆత్మ సైతం ఘోషించేలా షర్మిల నిర్ణయాలు ఉన్నాయని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం.
 
షర్మిల కాంగ్రెస్ లో సైతం ప్రస్తుతం ఏకాకిగా ఉన్నారు. ఆమెను నమ్ముకుని పోటీ చేస్తే గెలుస్తామనే నమ్మకం ఎవరిలో లేదు. కడప ఎంపీగా పోటీ చేసిన షర్మిల అక్కడ కూడా సానుకూల ఫలితాలను సాధించే విషయంలో ఫెయిల్ అయ్యారు. షర్మిల ధోరణి కాంగ్రెస్ పార్టీ నేతలకు సైతం నచ్చడం లేదు. ఆమె ధోరణితో రాజకీయాలలో సక్సెస్ కావడం కష్టమని కామెంట్లు వినిపిస్తున్నాయి. వాస్తవాలను అర్థం చేసుకోకుండా షర్మిల ప్రణాళికలు ఉన్నాయి.
 
జగన్ షర్మిల మధ్య ఏవైనా సమస్యలు ఉంటే ఆమె వాటిని పరిష్కరించుకోవడానికి వెళ్తున్న విధానం మాత్రం సరైనది కాదనే చెప్పాలి. రాజకీయాలలో ఇప్పటివరకు షర్మిల సాధించింది శూన్యం అనే చెప్పవచ్చు. ఏపీ ప్రజలు బీజేపీనైనా నమ్ముతారేమో కానీ కాంగ్రెస్ ను మాత్రం నమ్మరని నమ్మబోరని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
షర్మిల ఈ నెగిటివ్ కామెంట్ల విషయంలో సైతం ఎలా రియాక్ట్ అవుతారనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం. షర్మిల రాజకీయాలు తలలు పండిన విశ్లేషకులకు సైతం అర్థం కావడం లేదు. ఆమె పొలిటికల్ గా ఎన్నో రాంగ్ స్టెప్స్ వేస్తున్నారని ఆ స్టెప్స్ వల్ల భవిష్యత్తులో పొలిటికల్ కెరీర్ పూర్తిస్థాయిలో ప్రమాదంలో పడుతుందని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. జగన్, షర్మిల వేర్వేరు దారులలో ప్రయాణించి పొలిటికల్ కెరీర్ ను చేతులారా నాశనం చేసుకుంటున్నారని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: