బాబు - రేవంత్: రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగించకుంటే కష్టమే?

Purushottham Vinay

• బాబు, రేవంత్ జనాలిచ్చిన అవకాశాన్ని సరిగ్గా వాడుకుంటారా?
• అధికార అహాన్ని తలకి ఎక్కించుకుంటే కష్టం!
• రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాన్ని కొనసాగిస్తారా?

ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయి పది సంవత్సరాలు కాగా ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడంతో రాష్ట్ర అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగడం లేదు. తెలంగాణకి ప్రత్యేక హోదా రావడం వల్ల హైదరాబాద్ ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. మరోవైపు తెలుగు రాష్ట్రాలలో సీఎంలు మారుతున్నా విభజన సమస్యలు మాత్రం ఇంకా పరిష్కారం కావడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల కొత్త ముఖ్య మంత్రులు బాబు, రేవంత్ పాలన విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.చంద్రబాబు, రేవంత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇంకా సంవత్సరం కూడా కాలేదు. తీసుకునే నిర్ణయాలు ప్రజల్లో నెగిటివ్ అభిప్రాయాన్ని కలిగిస్తే ఖచ్చితంగా జగన్ కి కెసిఆర్ కి జరిగినట్లే ప్రజలు ఓట్ల రూపంలో నాయకులకు షాకిచ్చే అవకాశం ఉంది. కెసిఆర్,జగన్ కూడా అహం పెంచుకొని జనాల్లో నెగటివ్ అయ్యారు. కాబట్టి చంద్రబాబు, రేవంత్ కూడా ఖచ్చితంగా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికీ వారి అవసరాల అనుగుణంగా తెలుగు రాష్ట్రాల కోసం కలిసి మెలసి పని చెయ్యాలి. మనుషులు కలిసినట్టే మనసులు కలవాలి.ప్రస్తుతం చంద్రబాబు, రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలో ప్రజలు పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే అభివృద్ధి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. తెలంగాణకి ప్రత్యేక హోదా వచ్చినా ఒక్క హైదరాబాద్ తప్ప మరే ప్రాంతం అభివృద్ధి చెందలేదనే విమర్శలు వచ్చాయనే సంగతి తెలిసిందే. ఏపీలో అయితే అమరావతి అభివృద్ధి దిశగా ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయి. చంద్రబాబు, రేవంత్ రెడ్డి అద్భుతమైన పాలన అందించి అభివృద్ధి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారో లేదో చూడాల్సి ఉంది. గతంలో ఇతర పార్టీలైన వైసీపీ, బిఆర్ఎస్ మధ్య మొదట్లో మంచి రిలేషన్స్ ఉన్నా కానీ ఆ తరువాత ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఎలా పడితే అలా పాలన చేసి జనాల్లో నెగటివ్ అయ్యి దారుణంగా ఓడిపోయారు. ఇక వారి నుంచి చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇలాంటి తప్పులని నేర్చుకొని అవి భవిష్యత్తులో జరగకుండా రెండు రాష్ట్రాల మధ్య మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ రాష్ట్రాల అభివృద్ధికై ఇంకా మంచి పాలనకై ముందడుగులు వేయాల్సిన అవసరం ఉంది. లేదంటే వారు కూడా జగన్, కెసిఆర్ లాగా ఉంటే దారుణంగా ఓడిపోవడం పక్కా..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: