బాబు రేవంత్ స్నేహం కలకాలం కొనసాగేనా.. టీజీలో టీడీపీ పుంజుకుంటే రేవంత్ కు కష్టమే!

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. టీడీపీ ప్రకటించిన సంక్షేమ పథకాలు సైతం ప్రజలకు భారీ స్థాయిలోనే బెనిఫిట్ కలిగిస్తాయని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. మరోవైపు తెలంగాణలో రేవంత్ ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్న నేపథ్యంలో వీళ్లిద్దరి స్నేహ బంధం గురించి తరచూ చర్చ జరుగుతోంది.
 
అయితే ఏపీలో సంచలన విజయం సొంతం కావడంతో ప్రస్తుతం తెలంగాణపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. తెలంగాణలో ప్రముఖ నేతలెవరూ టీడీపీలో లేకపోయినా ఆ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు మాత్రం ఉన్నారు. తెలంగాణలో ఎన్నికలు జరగడానికి మరో నాలుగు సంవత్సరాల సమయం అయితే ఉంది. అయితే ఇదే సమయంలో తెలంగాణలో టీడీపీ పుంజుకుంటే రేవంత్ కు కష్టమే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
అయితే చంద్రబాబు, రేవంత్ భవిష్యత్తులో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే సందర్భం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. తెలంగాణలో ప్రస్తుతం బలమైన ప్రతిపక్షం లేకపోవడంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. తెలంగాణ టీడీపీ బాధ్యతలను బ్రాహ్మణి తీసుకునే ఛాన్స్ ఉందని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.
 
తెలంగాణ రాష్ట్రంలో బీ.ఆర్.ఎస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. కేసీఆర్ సైతం రాజకీయాలకు ఒకింత దూరంగా ఉండటంతో పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రాష్ట్రంలో టీడీపీ పుంజుకుంటే మాత్రం ఏం జరుగుతుందనే చర్చ సైతం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే రోజుల్లో ఊహించని మలుపులు చోటు చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చంద్రబాబు తనదైన వ్యూహాలతో పాలిటిక్స్ లో సంచలనాలు సృష్టించే విధంగా అడుగులు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: