గురువని బాబుకు ఆ ఒక్క మండలం ఇచ్చేసిన.. రేవంత్ ఇబ్బందుల్లో పడ్డట్టేనా?

praveen
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు కొలువుదిరాయి. గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీలను ప్రతిపక్ష హోదాకే పరిమితం చేశారు రెండు రాష్ట్రాల ప్రజలు. దీంతో తెలంగాణలో కనుమరుగవుతుంది అనుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఆంధ్రాలో కూటమి పార్టీలు అనూహ్యమైన విజయాన్ని సాధించి ఇక అధికారాన్ని చేపట్టాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఆంధ్రాలో అటు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా.. తెలంగాణలో టిడిపి నుంచి కాంగ్రెస్ లో చేరి వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధితులు చేపట్టి ఇక ఇప్పుడు ముఖ్య మంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు రేవంత్ రెడ్డి. ఇలా చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా గురు శిష్యులు కావడం గమనార్హం.

 ఎందుకంటే చంద్రబాబు టిడిపి అధినేతగా ఉన్న సమయంలోనే సైకిల్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్తానాన్ని ఎంతో విజయవంతంగా సాగించారు. అంతేకాదు అటు చంద్రబాబుకు ప్రియ శిష్యుడిగా కూడా కొనసాగారు అన్న విషయం తెలిసిందే. ఇలా తెలుగు రాష్ట్రాల్లో గురు శిష్యులు ఇద్దరు ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య ఎలాంటి సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయంపై ఎంతో ఆసక్తి నెలకొంది. ఇక ఇటీవలే ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏం చర్చించారు. ఎలాంటి విషయం పై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనే విషయంపై ఆసక్తి నెలకొంది.

 గతంలో ఒక పార్టీలో ఉన్నాం. ఇక ఎప్పుడు గురు శిష్యులుగా ఉన్నాం కదా అని ఒకరికి ఒకరు ఫేవర్ చేసుకుంటే మాత్రం ఎవరి గోతి వారు తవ్వుకున్నట్టే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చివరికి చంద్రబాబు అడిగిన అన్ని డిమాండ్స్ పక్కన పెడితే.. ఎన్నో రోజులుగా ఆంధ్రాలో కలపండి అంటూ డిమాండ్ చేస్తున్న ఒక్క మునగాల మండలాన్ని గురువు కోసం రేవంత్ ఆంధ్రకు వఇచ్చేసిన కూడా చివరికి సీఎం సీటుకే ఎసరు పడుతుంది. గతంలో ఆంధ్రాలో కలిసి ఉన్న మునగాల మండలం ఇక ఇప్పుడు నల్గొండ జిల్లాలో భాగమైంది. ఇక కోదాడ నియోజకవర్గం లో కొనసాగుతుంది. అయితే ఈ మండలాన్ని ఆంధ్రలో కలపాలి అంటూ ఎన్నో రోజులుగా అక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలా కీలకమైన డిమాండ్లు కాదు.. గురువు చంద్రబాబు కోరాడు కదా అని ఈ చిన్న కోరిక నెరవేర్చిన రేవంత్ తన గోతి తాను తవ్వుకున్నట్లే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: