హైదరాబాద్‌ పైన ఏపీకి ప్రేమ..వెంకన్నంటే తెలంగాణకు భక్తి?

Veldandi Saikiran
* హైదరాబాద్‌ తో తెలుగు ప్రజలకు తీరని బంధం
* 60 ఏళ్ల పాటు కలిసి ఉన్న ఏపీ, తెలంగాణ
* టీటీడీ ఆస్తులపై తెలంగాణ కన్ను?

ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలకు మధ్య విడతీయని బంధం ఉంది. దాదాపు 60 సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో.. తెలుగు ప్రజలు కలిసి ఉన్న సంగతి తెలిసిందే. అంతకుముందు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ... ఆ తర్వాత ఇండియాలో... విలీనమైంది. అనంతరం.. 1956 సంవత్సరంలో... తెలుగు వారంతా ఒకే రాష్ట్రంలో ఉండాలనే నినాదంతో... సీమాంధ్ర  అలాగే తెలంగాణ రాష్ట్రాలు కలిశాయి.

ఈ రెండిటి కలయికలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అయితే... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ప్రత్యేక తెలంగాణ నినాదం... తెరపైకి వస్తూనే ఉంది. అలా 60 సంవత్సరాల పాటు... పోరాడిన తెలంగాణ ప్రజలు... ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు. అయితే 60 సంవత్సరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  లో హైదరాబాద్ ను చాలా డెవలప్ చేశారు.  అందులో తెలంగాణ,  సీమాంధ్ర ప్రజల  కష్టార్జితం కచ్చితంగా ఉంది.

అయితే తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పాటు కావడంతో హైదరాబాద్ తో ఏపీ ప్రజల బంధం తెగిపోయింది. దీంతో అమరావతి ఏపీలో రాజధాని కాబోతుంది. అయితే..  ఇప్పటికి కూడా ఏపీ ప్రజలు హైదరాబాద్ పైన తమ ప్రేమను కొనసాగిస్తున్నారు. ఉన్నత చదువులకైనా, ఉద్యోగాలకైనా లేదా వ్యాపారాలకైన హైదరాబాదునే ఎంచుకుంటున్నారు.  కన్న తల్లి లాగా సెటిలర్స్ చూసుకుంటున్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును మరికొన్ని రోజులు ఉంచాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

అంతేకాకుండా... హైదరాబాద్ లో ఉన్న కొన్ని ఆస్తులను, భవనాలను ఏపీకి ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.  అదే సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం పై... తెలంగాణ ప్రజలు భక్తి పెంచుకుంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆ దేవాలయం తిరుమల దేవస్థానం. అలాంటి టీటీడీలో... తెలంగాణకు కూడా కొంతమేర వాటా కావాలని... డిమాండ్ చేస్తున్నారు అక్కడి ప్రజలు. దాదాపు 46% వరకు తెలంగాణకు వాటా ఇస్తే... బాగుంటుందంటున్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు... ఒకరి ప్రాంతంపై మరొక ప్రాంతం వారు... ప్రేమ పెంచుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: