కొత్త సమస్యలు సృష్టిస్తే బాబు, రేవంత్ కు ఇబ్బందే.. ఆ సమస్యలు పరిష్కరిస్తే చాలు?

Reddy P Rajasekhar
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీ, తెలంగాణ విడిపోయి పది సంవత్సరాలు కాగా ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడంతో రాష్ట్ర అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగడం లేదు. మరోవైపు తెలుగు రాష్ట్రాలలో సీఎంలు మారుతున్నా విభజన సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కొత్త సమస్యలు సృష్టిస్తే బాబు, రేవంత్ కు ఇబ్బందేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏ సమస్య ఏర్పడినా ఆ సమస్య ఇరు రాష్ట్రాల ప్రజల మనోభావాలకు సంబంధించిన సమస్య అవుతుందనే సంగతి తెలిసిందే. ఒక రాష్ట్రానికి న్యాయం జరగాలని చూస్తే మరో రాష్ట్రానికి అన్యాయం జరిగే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు. అందువల్ల బాబు, రేవంత్ సమావేశాలకు హాజరైన సమయంలో సైతం ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.
 
చంద్రబాబు, రేవంత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది కూడా కాలేదు. తీసుకునే నిర్ణయాలు ప్రజల్లో నెగిటివ్ అభిప్రాయాన్ని కలిగిస్తే ప్రజలు ఓట్ల రూపంలో నాయకులకు షాకిచ్చే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో సైలెంట్ ఓటింగ్ ఎన్నికల్లో చర్చనీయాంశం అవుతోంది. చాలా రాష్ట్రాలలో సర్వేలకు సైతం అందని ఫలితాలు వెలువడుతుండటం గమనార్హం.
 
చంద్రబాబు, రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలో ప్రజలు పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అభివృద్ధి విషయంలో చంద్రబాబు, రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. తెలంగాణలో హైదరాబాద్ మినహా మరే ప్రాంతం అభివృద్ధి చెందలేదనే విమర్శలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. ఏపీలో అమరావతి అభివృద్ధి దిశగా ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయి. చంద్రబాబు, రేవంత్ రెడ్డి అద్భుతమైన పాలన అందించి అభివృద్ధి విషయంలో ఎన్నో మెట్లు పైకి ఎక్కుతారేమో చూడాల్సి ఉంది. ఇతర పార్టీలకు విమర్శించే అవకాశం లేకుండా చంద్రబాబు, రేవంత్ రెడ్డి ముందడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: