చంద్రబాబు సీరియస్‌: ఇక నా కాళ్లకు దండం పెట్టొద్దు ?

Veldandi Saikiran
ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వీడాలని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇవాళ టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో సీఎం చంద్రబాబు నాయుడు చిట్‍చాట్ లో పాల్గొన్నారు. కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వీడాలని...ఎవరైనా నా కాళ్లకు దండం పెడితే, వారి కాళ్లకు నేను దండం పెడుతానని స్పష్టం చేశారు చంద్రబాబు.

ఇవాళ్టి నుంచి నా కాళ్లకు దండం పెట్టే విధానానికి పుల్‍స్టాప్ పెడుతున్నానని ప్రకటించారు చంద్రబాబు నాయుడు. తల్లిదండ్రులు,భగవంతుడు కాళ్లకు దండం పెట్టాలి తప్ప నాయకులకు కాదని వెల్లడించారు. నాయకుల కాళ్లకు దండం పెట్టి ఎవరూ తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దని కోరారు చంద్రబాబు నాయుడు. నాయకుల కాళ్లకు ప్రజలు, పార్టీ శ్రేణులు దండం పెట్టొద్దనే సంస్కృతి నా నుంచే ప్రారంభిస్తున్నానని తెలిపారు చంద్రబాబు నాయుడు.
ఇక అనంతరం పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉన్న నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భగా టీడీపీ పార్టీ కార్యాలయం వేదికగా సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రతి రోజూ ఒకరిద్దరు మంత్రులు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. కార్యకర్తలు.. సామాన్య ప్రజల నుంచి వినతులు స్వీకరించాలన్న చంద్రబాబు....పార్టీకి ప్రభుత్వానికి గ్యాప్ రాకుండా చూసుకునే బాధ్యత మంత్రులదేనని స్పష్టం చేశారు.
వ్యక్తిగత దూషణలకు.. భౌతిక దాడులకు దిగకుండా సంయమనం పాటించాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు... వైసీపీ తరహాలో టీడీపీ కూడా వ్యవహరిస్తే తేడా ఏముందని నిలదీశారు. గత ప్రభుత్వంలో తప్పులు చేసిన వారికి చట్టపరంగా శిక్షలు మాత్రం కచ్చితంగా ఉంటాయన్న చంద్రబాబు.... చాలా జాగ్రత్తగా పని చేయాలని హెచ్చరించారట. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో మంచి చేయాలనుకునేవారికి ఇక స్పీడ్ బ్రేకర్లు, విధ్వంసం అనేది ఉండదని కూడా స్పష్టం చేశారు బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: