ఏపీ: సోషల్ మీడియాలో ఆ టిడిపి నేత అప్పుడు హీరో.. ఇప్పుడు విలనా..?

Divya
ఎన్నికల ముందు సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ గా మారిన ఒక వీడియో టిడిపి నేతలకు కార్యకర్తలకు బాగా కలిసి వచ్చింది.. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు తాజాగా అదే వీడియో ట్రోల్ కు గురయ్యేలా చేస్తోంది. గతంలో టిడిపి పార్టీలో హీరోగా ఉన్న ఆ నేత ఇప్పుడు విలన్ గా మారినట్లు కామెంట్స్ చేస్తున్నారు.. జల వనరుల శాఖ నిమ్మల రామానాయుడు ను పలువురు నెటిజెన్స్ టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు అందుకు గల కారణమేంటో ఇప్పుడు చూద్దాం..

వైసిపి ప్రభుత్వం అమలు చేసిన అమ్మ ఒడి పథకానికి టిడిపి పార్టీ తల్లికి వందనం అనే పేరు మార్చి జగన్ సర్కార్ కేవలం ఇంట్లో ఒకరికి మాత్రమే 15 వేల రూపాయలు అందించారని.. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే ఇంట్లో అంతమందికి 15000 చొప్పున ఒక్కొక్కరికి ఇస్తామంటూ గతంలో ఎన్నికల ముందు నిమ్మల రామానాయుడు చేసిన వీడియో తెగ ఆకట్టుకుంది. ఈ ప్రచారం మరింత కలిసిందని సూపర్ సెక్స్ హామీ పథకాలకు కూడా ఉపయోగపడిందని చెప్పవచ్చు.

టిడిపి అభ్యర్థి నిమ్మల రామానాయుడు తన నియోజకవర్గంలో ఇంటింటా ఈ విషయాన్ని ప్రచారాన్ని చేయడం జరిగింది.. ముఖ్యంగా పిల్లలను చూపిస్తూ నీకు 15000 నీకు 15000 నీకు 15000 ఇదిగో ఇప్పుడే వచ్చిన ఈ పాపకు కూడా 15000 రూపాయలు అలాగే ప్రతి మహిళకు ఏడాదికి 18 చొప్పున తమ ప్రభుత్వం రాగానే అందిస్తామంటూ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు దాన్నే ట్రోలర్స్ వైరల్ గా చేస్తున్నారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి జీవో మాత్రం ఒక్కో తల్లి అకౌంట్లో 15000 చొప్పున వెయ్యబోతున్నట్లు తెలిపారు.గతంలో రామానాయుడు చెప్పిన రామానాయుడుని సైతం తమ నియోజకవర్గంలో కూడా పలువురు నెటిజన్లు నిలదీస్తున్నారని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అప్పుడు హీరోగా మారిన ఈయన ఇప్పుడు విలన్ గా చూస్తున్నారా అనేది  ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: