కూటమి పాలన @ 30: 5 శాఖల్లో చక్రం తిప్పిన దమ్మున్న లీడర్..టాలీవుడ్ కు ఊపిరి పోసాడు?

Veldandi Saikiran


*   5 శాఖల్లో పవన్ కళ్యాణ్ మార్క్
*   టాలీవుడ్ పెద్దలతో చర్చలు
*   పిఠాపురంపై స్పెషల్ ఫోకస్
* చంద్రబాబుతో సాన్నిహిత్యం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. తన పాలనలో మార్క్ చూపిస్తున్నారు.  మంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత... ఈ 30 రోజుల్లో... ఏపీ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ.. పవన్ కళ్యాణ్ శభాష్ అనిపించారు. గతంలో చేసిన అనుభవం లేకున్నా కూడా... ఐదు శాఖలను కవర్ చేయగలిగారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి గానే కాకుండా.. పంచాయతీరాజ్, సైన్స్ అండ్, పర్యావరణం, గ్రామీణ అభివృద్ధి శాఖలను చేపట్టి తన పాలనను కొనసాగించారు.
ముఖ్యంగా... ఏపీ ప్రజలు సమస్య ఉందని.... ఆయన కారును ఆపినా కూడా... వెంటనే అక్కడే ఆగి... వారి సమస్యలను తీర్చారు.  ఇటీవల మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం..  దగ్గర ప్రజా దర్బార్ నిర్వహించి.. ప్రజల సమస్యలు తీర్చారు.  అధికారులను పరిగెత్తించారు పవన్ కళ్యాణ్. అక్కడితో ఆగకుండా... ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోనని... ఐదు సంవత్సరాలు ఏపీకి మంచి పాలన అందిస్తానని ప్రకటించారు.
 వైసిపి పాలనలో  పంచాయతీరాజ్ శాఖ డబ్బులను కాల్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో దానిపై సమీక్ష నిర్వహించిన పవన్ కళ్యాణ్...  పంచాయతీరాజ్ శాఖ ఆదాయాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇటు... టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన  సినిమా పెద్దలను... ఏపీకి రప్పించి... వారి డిమాండ్లను పరిశీలించే దిశగా అడుగులు వేశారు.  సినిమా ఇండస్ట్రీ పై పూర్తి అనుభవం ఉన్న పవన్ కళ్యాణ్... టాలీవుడ్ ఇండస్ట్రీకి  ఓ భరోసా కల్పించారు.
 ఏపీలో చిత్ర పరిశ్రమ విస్తరించేలా.. చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా తొలిసారిగా పిఠాపురం నియోజకవర్గంలో గెలిచిన పవన్ కళ్యాణ్... అక్కడే ఇల్లు కట్టుకుంటున్నారు. ప్రతివారం పిఠాపురం వెళ్లి అక్కడి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా... జనసేన పార్టీ క్యాడర్ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కష్టపడ్డ వారికి పదవులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారో పవన్ కళ్యాణ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: